రామోజీ విశ్వరూపం

Update: 2015-12-04 06:06 GMT
మీడియో మొఘల్ రామోజీరావు ఏం చేసినా గ్రాండ్ గా ఉంటుంది. ఆయన ఆలోచనలు ఎవరికి అందనంత దూరంగా ఉంటాయి. నిజానికి ఆలోచించటానికి కూడా అందనంత ఎత్తులో ఉంటాయి. రామోజీరావు గురించి తెలిసిన వారు.. ఆయనతో సన్నిహత సంబంధాలు ఉన్న వారు.. ఆయన విజన్ గురించి గొప్పగా మాట్లాడతారు. నిజానికి ఆయన ప్లానింగ్ చూస్తే ఇది నిజం అనిపించక మానదు. ఇప్పుడు ఛానళ్ల గురించి మాట్లాడే వారు.. అప్పుడెప్పడో దశాబ్దాల కిందనే ఒకేసారి పదికి పైగా ఛానళ్లను ఒకేసారి స్టార్ట్ చేసిన దమ్ము ధైర్యం రామోజీకే సొంతం అని చెప్పాలి.

ఒక ప్రాంతీయ మీడియా సంస్థ దేశంలోని పలు భాషలకు సంబంధించి ఛానళ్లను షురూ చేయటం అంత చిన్నవిషయం కాదు. ఇక.. తన పేరు మీద ఏర్పాటు చేసుకున్న ఫిలింసిటీ వ్యవహారమే తీసుకుంటే.. ఫిలింసిటీలో అడుగు పెట్టిన వారు ఎవరైనా సరే.. రామోజీ గ్రాండియర్ కు ఫిదా కావాల్సిందే.

ఎంత ఊహించుకొని వెళ్లినా.. రామోజీ ఫిలింసిటీలోకి అడుగుపెట్టి.. అక్కడి పరిస్థితుల్ని కళ్లతో చూసిన వారు షాక్ తినాల్సిందే. భారీతనం అంటే ఇంత భారీగా ఉంటుందా అనిపించక మానదు. అలాంటి ఆయన తాజా ఓం అన్న ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. దేశంలోని పుణ్యక్షేత్రాలు ఎలా ఉంటాయో.. వాటి నకళ్లను ఏర్పాటు చేయటమే కాదు.. అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారో.. అలాంటివే నిర్వహించటం లాంటి ఎన్నో విశేషాలతో ఆ ప్రాజెక్టు పనులు ఓ పక్క జోరుగా సాగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. రామోజీకి సంబంధించి తాజాగా వినిపిస్తున్న ఒక వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం తనకున్న ఛానళ్లలో చాలావరకూ అమ్మేసిన ఆయన.. ఈ మధ్యనే నాలుగు ఛానళ్లను ఒకేసారి స్టార్ట్ చేయటం తెలిసిందే. ఇప్పుడు ఆయన మరిన్ని ఛానళ్లను ఒకేసారి ఏర్పాటు చేయాలన్న భారీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

భారతీయ మార్కెట్లో మరే మీడియా సంస్థా చేయని విధంగా ఒకేసారి డజన్ల కొద్దీ ఛానళ్లను తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్లానింగ్ మొత్తం పక్కాగా పూర్తి కావటమే కాదు.. డిజిటల్ మార్కెట్లోకి భారీగా రావాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రామోజీ రావు లాంటి వ్యక్తి అనుకోవాలే కానీ.. టీవీ ఛానళ్ల గురించి ఎవరికి పెద్దగా అవగాహన లేని సమయంలోనే ఒకే సారి పలు ఛానళ్లను స్టార్ట్ చేసిన ఆయన.. తలుచుకుంటే ఒకేసారి డజన్ల కొద్దీ ఛానళ్లు స్టార్ట్ చేయటం పెద్ద కష్టమేమీ కాదు. అయితే.. ఇప్పుడు వినిపిస్తున్న వార్తలే నిజం అయితే.. రామోజీ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారని చెప్పొచ్చు. మరి.. రామోజీ విశ్వరూప సందర్శనం చూసే అవకాశం ఎప్పటికి దక్కుతుందో..?
Tags:    

Similar News