కొన్ని సంఘటనల గురించి వింటే ఇలా కూడా జరుగుతుందా? అని అనుకుంటాము. కానీ జరుగుతాయి. అలాంటివి చూసినపుడు ఆశ్చర్యపోతాం. అలాంటి ఆశ్చర్యంతో కూడిన విస్మయకర ఘటనే ఇది. జార్ఖండ్ లోని రాంచీ పట్టణానికి చెందినటువంటి రాజేష్ అనే పురుషపుంగవుడు...ఇద్దరు ఆడవాళ్లను పెళ్లి చేసుకున్నాడు. సహజంగానే గొడవలు అయ్యాయి. అయితే, దానికి మనోడు ఆసక్తికర పరిష్కారం చూపించాడు. అనంతరం జరిగిన సంఘటనలు దిమ్మతిరిగిపోయేలా ఉన్నాయి.
ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్న రాజేష్ బాగోతం ఆలస్యంగా బయటపడటంతో భార్యలు గొడవ చేశారు. అయినా ఎలాగోలా మేనేజ్ చేసుకొని ఇద్దరితో కలిసి ఒకే ఇంట్లో జీవించాడు. ఈ సమయంలోనే గొడవలు వచ్చాయి. ఇద్దరూ వేర్వేరు కుటుంబాలుగా విడిపోయారు. అయితే, ఇక్కడే ఇంకో ట్విస్ట్. సదరు రాజేషుడు మొదటి భార్యతోనే..ఎక్కువ సమయం గడుపుతున్నాడని రెండో భార్య పోలీస్ స్టేషనుకు వెళ్లింది. ఇదేం కేసురా నాయన అనుకుంటూ...పోలీసులు సహజంగానే నిట్టూర్చారు.
దీంతో రాజేష్ ను పిలిచి కాస్త రెండో భార్యను కూడా చూసుకో అని సూచించారు. దాన్ని ఫాలో అయ్యాడు ఈ ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగడు. అయితే ఇక్కడ మరో సర్ ప్రైజ్. మొదటి భార్య పోలీసులను కలిసి...తన భర్త తనను పట్టించుకోవడం లేదని వాపోయింది. ఇక లాభం లేదని పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నాయన...నువ్వు మూడురోజులు ఓ భార్య దగ్గర...మరో మూడు రోజులు ఇంకో భార్య దగ్గర ఉండు. ఇక మిగిలిన ఆ ఒక్కరోజును...మీ తల్లిదండ్రుల కోసం కేటాయించు అంటూ పంచాయతీకి పరిష్కారం చూపించారు.