నమ్మటానికి కాస్త కష్టంగా ఉన్నా ఇది నిజం. ఒక జాబ్ పోర్టల్ ను తాజాగా అమ్మారు. ఈ డీల్ లో సదరు వెబ్ సైట్ ఏకంగా రూ.2864 కోట్లను సంపాదించటం ఇప్పుడు వ్యాపారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐటీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన ఈ డీల్ విషయంలోకి వెళితే..
ఉద్యోగ రిక్రూట్ మెంట్ వెబ్ సైట్ మాన్ స్టర్ డాట్ కామ్ సంస్థను నెదర్లాండ్స్ కు చెందిన రాన్డ్ స్టాడ్ అనే సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకోసం మాన్ స్టర్ కు ఆఫర్ చేసిన మొత్తం 429 మిలియన్ డాలర్లు. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.2864 కోట్లు. చక్కటి టెక్నాలజీ.. డిజిటల్.. మొబైల్.. సోషల్ సొల్యూషన్స్ ఉన్న మాన్ స్టర్ వెబ్ సైట్.. రాన్డ్ స్టాడ్ కుమరింత బలంగా మారుతుందన్నఆశాభావం వ్యక్తమవుతోంది.
నిజానికి మాన్ స్టర్ విలువ గతంలో మరింత ఎక్కువగా ఉండేది.. ఈ మధ్య కాలంలో దీని విలువ తగ్గిందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఒక వెబ్ సైట్ ను ఒక సంస్థ రూ.2864 కోట్లు పెట్టి కొనుగోలు చేయటం అంత చిన్న విషయం కాదనే చెప్పాలి.