సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేసిన దానిపై రంగనాయకమ్మ విచారణ ఎదుర్కొంటున్నారు. ఆమెపై నమోదైన కేసు విషయంలో సీఐడీ విచారణ చేస్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని తప్పుదోవపట్టించేలా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేశారని గుర్తించారు. సీఐడీ ఎస్పీ సరిత పర్యవేక్షణలో విచారణ చేసిన అనంతరం ఆమెను ఇంటికి పంపేశారు. మరోసారి విచారణకు రావాలని ఆమెకు సూచించారు.
ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నా అభియోగాలతో రంగనాయకమ్మపై కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా తొలిరోజు గురువారం సీఐడీ విచారణకు ఆమె హాజరయ్యారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆమెను అధికారులు ప్రశ్నించారు. ఈ సమయంలో రంగనాయకమ్మను సీపీఐ, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. విచారణ అనంతరం సీఐడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆమె సోషల్ మీడియా యాక్టివిస్టే.. తాను ఎలాంటి నేరం చేయలేదని, విశాఖ ఎల్జీ గ్యాస్ లీకేజీ ఘటనపై వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే ఫేస్‌బుక్‌లో షేర్ చేశానని, అలా పోస్టులు పెట్టడం తప్పని తనకు తెలియదని తెలిపారని ఆ ప్రకటనలో ఉంది. ప్రభుత్వంపై బురదజల్లే ఉద్దేశంతోనే ఆమె పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి పోస్టులు పెట్టటానికి సరైన కారణాలు, సమాధానాలు చెప్పలేకపోయారని అధికారులు పేర్కొన్నారు.
అయితే పాత పోస్టులు కూడా పరిశీలించారు. అమ్మఒడి, రైతుభరోసా, వాహనమిత్ర పథకాలను కూడా ఆమె ఎద్దేవా చేస్తూ పోస్టులు పెట్టారని గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి 50 శాతం జీతాలు తగ్గించారని పోస్టు చేసిన దానిని చూశారు. మూడు రాజధానుల్లో ఒకటి కరోనా... రెండోది విష వాయువు, మూడోది రైతుల ధర్నాఅని ఇంకో పోస్టు ఉండడాన్ని గుర్తించి వివరాలు సేకరించారు.
మల్లాది రఘునాథ్ పోస్టును రంగనాయకమ్మ షేర్ చేశారు. ఏ1గా రంగనాయకమ్మ, ఏ2గా రఘునాథ్‌ను గుర్తించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఉంటున్న రఘునాత్‌ను కూడా విచారణకు రావాల్సిందిగా సీఐడీ నోటీసులు పంపింది. ఇద్దరినీ కలిపి విచారించి, వాళ్లు చెప్పే సమాధానాలను బట్టి ఒకటి రెండు రోజుల్లో అరెస్టు చేసి, రిమాండ్కు తరలించే అవకాశాలు ఉన్నాయి. ప్రాథమిక ఆధారాలు సేకరించారు. గుంటూరు నగరంలో ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన పూంతోట రంగనాయకమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. గుంటూరులోని శంకర్ విలాస్ హోటల్ కు ఆమె డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
టీడీపీపై, చంద్రబాబుపై వీరాభిమానం ఉంది. ఆమె ఫేస్‌బుక్ ప్రొఫైల్ లో ''మళ్లీ నువ్వే రావాలి'' అనే నినాదంతో చంద్రబాబును కవర్ ఫొటోగా పెట్టుకున్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు, విధాన నిర్ణయాలపై నిత్యం తన అభిప్రాయాలను ఫేస్‌బుక్ ద్వారా వ్యక్తం చేస్తున్నారు.
ఐపీసీ సెక్షన్ 505(2), సెక్షన్ 153(ఎ), సెక్షన్ 188, సెక్షన్ 120(బి) సెక్షన్ 34, ఐటీ చట్టంలోని సెక్షన్ 67 వీటి కింద నేరం రుజువైతే 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు జరిమాన ఉండే అవకాశం ఉంది. త్వరలోనే ఏ2ను విచారించి, ఆ తర్వాత వారిద్దరిని కలిపి విచారించి చర్యలు తీసుకోనున్నారు.