టీమిండియా, ఇంగ్లండ్ ల మధ్య కెన్నింగ్టన్ ఓవల్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించి భారత ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన విదేశీయుల జాబితాలో టాప్ రేంజ్ కు దూసుకుపోయాడు రోహిత్. తన కెరీర్ లో ఇంగ్లండ్ లో మొత్తం తొమ్మిది సెంచరీలను పూర్తి చేశాడు రోహిత్. దీంతో రాహుల్ ద్రావిడ్ రికార్డును రోహిత్ అధిగమించాడు.
టెస్టులు, వన్డేలు కలిపి రాహుల్ ద్రావిడ్ ఇంగ్లండ్ లో ఎనిమిది సెంచరీలు కొట్టాడు. ఇప్పుడు రోహిత్ తొమ్మిదో సెంచరీని పూర్తి చేశాడు. టెస్టుల్లో విదేశాల్లో రోహిత్ కు ఇదే తొలి సెంచరీ. అయితే.. ఇంగ్లండ్ లో పరిమిత ఓవర్ల మ్యాచ్ లలో రోహిత్ సెంచరీలు బాదాడు. వన్డేలు, టీ20ల్లో కూడా అక్కడ సెంచరీలు చేసిన ఘనత రోహిత్ కు ఉంది. అవన్నీ కలిపి ఎనిమిది సెంచరీలకు తోడు, టెస్టుల్లో సాధించిన తొలి విదేశీ సెంచరీతో ఇంగ్లండ్ లో మొత్తం తొమ్మిది సెంచరీలను బాదినట్టుగా అయ్యింది రోహిత్ శర్మ.
ఇక ఇంగ్లండ్ పర్యాటక జట్లకు సంబంధించిన బ్యాట్స్ మెన్లలో అక్కడ అత్యధిక సెంచరీలు సాధించిన ఘనత విఖ్యాత బ్యాట్స్ మన్ బ్రాడ్ మన్ పేరు మీద ఉంది. ఇంగ్లండ్ లో మొత్తం 11 సెంచరీలను సాధించాడు బ్రాడ్ మన్. ఇప్పుడు రోహిత్ శర్మ 9 సెంచరీలతో క్రికెట్ పురిటిగడ్డపై అత్యధిక సెంచరీలను సాధించిన విదేశీ బ్యాట్స్ మెన్లలో టాప్ రేంజ్ లో నిలిచాడు.
మరి శర్మ దూకుడు చూస్తే.. బ్రాడ్ మన్ రికార్డును బద్ధలు కొట్టే అవకాశాలు లేకపోలేదు. తన కెరీర్ లో ఈ ఇండియన్ బ్యాట్స్ మన్ ఇంగ్లండ్ లో మరిన్ని మ్యాచ్ లు ఆడే అవకాశాలు మిగిలే ఉన్నాయి. గత కొన్నాళ్లుగా రోహిత్ శర్మ అద్భుతమైన ఆట తీరునే చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇలాంటి అరుదైన రికార్డులు అసాధ్యం ఏమీ కాదు.