భారత బ్రాండ్ కు దక్కిన అరుదైన గౌరవం.. టాప్ 50లో స్థానం

Update: 2021-06-26 04:30 GMT
టాటా గ్రూప్ నకు చెందిన అనేక విభాగాల్లో హోటల్ విభాగం ఒకటి. అతిధ్య రంగానికి సంబంధించి ‘తాజ్’ బ్రాండ్ పేరుతో విలాసవంతమైన హోటళ్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన హోటల్ బ్రాండ్లకు సంబంధించిన టాప్ 50 జాబితాను తాజాగా విడుదల చేశారు. అందులో.. తాజ్ కు వందకు 89.3 పాయింట్లు సాధించటం ద్వారా ట్రిపుల్ ఏ రేటింగ్ లభించింది.

 ప్రపంచంలో అత్యుత్తమ హోటల్ సేవల్ని అందించే విలువైన బ్రాండ్ గా హిల్టన్ హోటల్స్ నిలిచింది. అయితే.. కొవిడ్ కారణంగా ఈ బ్రాండ్ తన విలువను 30 శాతం కోల్పోయినప్పటికి తన స్థానాన్ని చెక్కు చెదరకుండా చూసుకోవటం దీని ప్రత్యేకతగా చెప్పాలి. ఇక.. తాజ్ విషయానికి వస్తే.. లండన్ కు చెందిన బ్రాండ్ ఫైనాన్స్ అనే కన్సెల్టెన్సీ సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అందులో ప్రపంచ వ్యాప్తంగా టాప్ 50 హోటల్ బ్రాండ్లను ఎంపిక చేశారు. అందులో తాజ్ కు చోటు లభించింది.

తమ హోటల్ కు వచ్చే అతిధులకు ప్రపంచ స్థాయి విలాసవంతమైన అనుభవాన్ని.. అతిథ్యాన్ని అందించటమే దానికి తాజా గుర్తింపు లభించేలా చేసిందని చెబుతున్నారు. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ తన బ్రాండ్ ఇమేజ్ కు ఏ మాత్రం డ్యామేజ్ కలుగకుండా చూసుకోవటంలో తాజ్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి. ఏమైనా.. తాజ్.. వహ్ తాజ్ అనేలా చేసిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News