అగ్ర‌రాజ్యంలో తెలుగు బిడ్డ‌కు అరుదైన గుర్తింపు!

Update: 2021-04-09 14:30 GMT
అమెరికాలో తెలుగు బిడ్డ‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. యూఎస్ లోని ప్ర‌ముఖ కంపెనీల్లోనే ఒక‌టైన 'కామ్ స్కోప్' సీఐఓ(చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్)గా తెలంగాణ రాష్ట్రంలోని న‌ల్గొండ జిల్లా వాసి జొన్న‌ల గ‌డ్డ ప్ర‌వీణ్ నియ‌మితుల‌య్యారు‌. ఈ విష‌యాన్ని ప్ర‌ఖ్యాత మ్యాగ‌జైన్ ఫోర్బ్స్ వెల్ల‌డించింది.

అప్ప‌టి న‌ల్గొండ జిల్లా మిర్యాలగూడ‌కు చెందిన ప్ర‌వీణ్.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోనే ప్రాథ‌మిక విద్య‌ను పూర్తిచేశారు. ఆ త‌ర్వాత ఎయిడెడ్ కాలేజీలో బీఎస్సీ పూర్తిచేశారు. అనంత‌రం ఉస్మానియా యూనివ‌ర్సిటీలో పోస్టు గ్రాడ్యుయేష‌న్ చేసిన ఆయ‌న‌.. 2001లో ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ లో పీహెచ్ డీ పూర్తిచేశారు.

సుమారు 12 సంవ‌త్స‌రాల క్రితం కామ్ స్కోప్ లో చేరిన ప్ర‌వీణ్‌.. ఆ సంస్థ‌లో డైరెక్ట‌ర్‌, వైస్ ప్రెసిడెంట్‌, సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ హోదాల్లో ప‌నిచేశారు. ఇప్పుడు ఏకంగా సీఐఓగా బాధ్య‌లు చేప‌ట్టారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 45 సంవ‌త్స‌ర‌లు. ఈ ఘ‌న‌త‌పై ఆయ‌న స్పందిస్తూ.. చాలా సంతోషంగా ఉంద‌న్నారు. త‌న శ్ర‌మ‌కు త‌గిన గుర్తింపు ల‌భింద‌ని భావిస్తున్న‌ట్టు చెప్పారు.
Tags:    

Similar News