కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుకు పటాసులు ఉన్న పైనాపిల్ తినిపించి చంపిన ఘటనపై ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ట్విట్టర్ లో ఒక పోస్ట్ లో పేర్కొన్నారు. మలప్పురంలో జరిగిన ఈ ఘోరంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో రతన్ టాటా నేడు ట్విటర్ వేదికగా స్పందించారు.
ఈ విషయంలో ఆ ఏనుగుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.‘కొందరు వ్యక్తులు పటాసులు నింపిన పైనాపిల్ ఆశపెట్టి అమాయకమైన ఓ ఏనుగును చంపిన ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, కలవరపాటుకు గురిచేసింది. అమాయక జంతువులపై ఇటువంటి నేరపూరిత చర్యలకు, సాటి మనుషుల హత్యలకు తేడా ఏమీ లేదు. చనిపోయిన ఏనుగుకు న్యాయం జరగాలి...’’ అని టాటా తన పోస్టులో డిమాండ్ చేశారు.
ఈ ఉదంతంపై కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ స్పందించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరుపుతుందని, ఏనుగు మరణానికి కారకులైన నేరగాళ్ళను పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలూ జరుగుతాయని ఆయన చెప్పారు. క్రాకర్స్ ని ఆహారం గా పెట్టి ఒక ప్రాణిని చంపడం భారతీయ సంస్కృతి కాదని ఆయన ట్వీట్ చేశారు.
పలక్కాడ్ జిల్లాలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ సమీపంలోని ఓ గ్రామంలోకి ప్రవేశించిన ఈ ఏనుగుకు స్థానికులు కొందరు టపాకాయలు కూర్చిన పైనాపిల్ పెట్టడంతో అది తిని గజరాజం మృతి చెందింది. గతమే 27 న నదిలోకి దిగడానికి ముందు ఈ ఏనుగు కాలిన గాయం బాధతోనే గ్రామమంతా తిరిగినట్టు వెల్లడైంది. ఈ ఉదంతం పై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.