అవినీతిపై అడిగితే శివాలెత్తిన రేషన్ డీలర్..తూకం రాళ్లతో ఇద్దరి తలలు పగలగొట్టాడు
ఆ రేషన్ దుకాణం సమయానికి తెరిచిందే లేదు. పంపిణీలో అంతా అవకతవకలే. తూకంలో కూడా అన్ని మోసాలే. ఇదేమని లబ్దిదారులు ప్రశ్నించి నందుకు డీలర్ రెచ్చిపోయాడు. తూకం వేసే రాయి తీసుకొని ఇద్దరి తలలు పగలగొట్టాడు. వారిద్దరికీ తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఈ సంఘటన ఎక్కడో కాదు. సీఎం జగన్ నివాసానికి అతి సమీపంలో జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఈ ఘటన జరిగింది. ఆ గ్రామంలో వేణు అనే వ్యక్తి రేషన్ షాపు నిర్వహిస్తున్నాడు. అయితే అవకతవకలపై అంతే లేకుండా పోయింది. లబ్ధిదారులను అన్ని విధాల మోసం చేసేవాడు. సమయానికి షాపు తెరవకపోవడం, తప్పుడు లెక్కలు వేస్తూ జనాన్ని మోసగించడం చేసేవాడు.
అతడి అరాచకాలను భరించలేక గ్రామస్తులు ప్రశ్నించడంతో ఆ డీలర్ రెచ్చిపోయాడు. నన్నే ప్రశ్నిస్తారా.. మీకు దిక్కున్నచోట చెప్పుకోండి.. అంటూ దుర్భాషలాడాడు.తూకం వేసే రాయిని తీసుకుని ఇద్దరి తలలు పగలగొట్టాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.గతంలో కూడా వేణు సరుకుల కోసం వచ్చిన పలువురు మహిళలపై దాడికి పాల్పడ్డాడని, భార్య పేరుతో డీలర్ షిప్ తీసుకొని ఇలా రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాడని గ్రామస్తులు వాపోయారు. మోసాలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడికి దిగుతుండటం తో చాలామంది రేషన్ సరుకులు తీసుకోవడమే మానేశారని గ్రామస్తులు ఆరోపించారు. డీలర్ దాడిలో గాయపడిన ఇద్దరు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు.