హైదరాబాద్ లో రేవ్ పార్టీ: చిక్కిన సెలబ్రెటీలు పిల్లలు?

Update: 2022-04-03 06:48 GMT
హైదరాబాద్ లో మరో భారీ రేవ్ పార్టీ బయటపడింది. నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. దాదాపు 157 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ఉన్నట్టు చెబుతున్నారు. ఫండింగ్ మింక్ అనే పబ్ పై అధికారులు దాడులు చేశారు. ఈ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహించారు.  

ప్రముఖ మీడియాల్లో వస్తున్న కథనాల ప్రకారం.. ఈ రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఉన్నట్టు తేలింది. ఇక భారీగా సినీ ప్రముఖుల పేర్లు బయటపడుతున్నాయి. ప్రముఖ అగ్రహీరో సోదరుడి కుమార్తె, ఒక నటి కుమార్తె కూడా ఇందులో పట్టుబడినట్టు సమాచారం.  దాదాపు 157మందిని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు సమాచారం. తెల్లవారుజామున 3 గంటల వరకూ ఈపార్టీ జరిగింది. ఇందులో డ్రగ్స్ వాడని వారిని వదిలేశారు. డ్రగ్స్ వాడుతున్న అనుమానితులు కొందరిని మాత్రమే పోలీసులు అదుపులో ఉంచుకున్నట్టు తెలిసింది.

మొత్తం 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఇందులో 99 మంది యువకులు, 39మంది యువతులు ఉన్నారు. 19మంది పబ్ సిబ్బంది కూడా ఉన్నారు. ఆయనతోపాటు మరికొందరు సినీ ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దాడుల్లో రాహుల్ సిప్లిగంజ్, ఉప్పల్ అనిల్ కుమార్, స్టార్ డాటర్, సిరీస్ రాజు కుమారుడు ఉన్నట్టుగా సమాచారం.

మరోవైపు ఈ రేవ్ పార్టీపై దాడి చేసిన సమయంలో కొకైన్, గంజాయి, కొన్ని రకాల డ్రగ్స్, ఎల్ఎస్.డీతో ఉన్న సిగరెట్లను పోలీసులు పబ్ బయట.. కిటీకీల వద్ద, బాత్రూంలలో గుర్తించినట్టు తెలిసింది. పోలీసులు వస్తున్నారని వీటిని బయటపడేసినట్లుగా చెబుతున్నారు. అనంతరం వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పబ్ లో ఇప్పటికే 40 గ్రాముల కొకైన్ వాడేశారు. డ్రగ్స్ వాడిని వారిని మాత్రమే పోలీసులు అదుపులో ఉంచుకున్నట్టు తెలిసింది.  పబ్ మాజీ ఎంపీ కుమార్తెదని కూడా స్థానికులు చెబుతున్నారు.

మరికొందరు ప్రముఖుల పిల్లలు కూడా రేవ్ పార్టీలో పోలీసులకు చిక్కారని వార్తలు వస్తున్నాయి. స్టార్ డాటర్ ఇందులో చిక్కినట్టు తెలిసింది. కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమార్తె కూడా పట్టుబడినట్టు చెబుతున్నారు. వీరందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించిన అధికారులు వారికి కౌన్సిలింగ్ తాజాగా డ్రగ్స్   మందిని ఇంటికి పంపించినట్టు సమాచారం. నోటీసులు ఇచ్చి ఇంటికి పంపినట్లు సమాచారం. మరోసారి స్టేషన్ కు విచారణ నిమిత్తం పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇక ఈ పబ్ నిర్వాహకులు అభిషేక్ ఉప్పల్, అనిల్ కుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది  

ఇప్పటికే హైదరాబాద్ లో రేవ్ పార్టీలకు అడ్డాగా మారిందన్న విమర్శలున్నాయి. శివారుల్లో జోరుగా ఈ పార్టీలు సాగుతున్నాయని.. డ్రగ్స్ వాడుతున్నట్టు బయటపడింది. ఈ క్రమంలోనే పబ్స్ లో పార్టీల్లో డ్రగ్స్ వాడకం నియంత్రించేందుకు పోలీసులు కొరఢా ఝలిపిస్తున్నారు. తాజాగా మరోసారి పెద్ద స్థాయిలో రేవ్ పార్టీ జరిగిందని.. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ దాడులు చేసినట్టు సమాచారం. ఈ పార్టీలో ప్రముఖ సినీ, రాజకీయ నేతల పిల్లలు, యువతులు ఎక్కువగా చిక్కినట్టుగా సమాచారం.
Tags:    

Similar News