రావెల చేరుతున్న పార్టీ ఏదంటే?

Update: 2019-06-08 11:58 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్కు ఊహించ‌ని రీతిలో షాకిచ్చిన ఏపీ మాజీ మంత్రి రావెల త‌న త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌ను చెప్ప‌క‌నే చెప్పేశారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో జ‌న‌సేన‌కు గుడ్ బై చెబుతున్నట్లుగా పేర్కొన్న రావెల‌.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అభ్య‌ర్థిగా గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు బ‌రిలోకి దిగిన విష‌యం తెలిసిందే.

ఎన్నిక‌ల్లో ఎదురైన ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో.. పార్టీ ఓట‌మిపై స‌మీక్ష‌లు జ‌రుపుతున్న ప‌వ‌న్ కు రావెల నిర్ణ‌యం అశ‌నిపాతంలా మారింద‌న్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇలాంటివి రానున్న రోజుల్లో ఖాయ‌మ‌న్న భావ‌న‌లో ఉన్న ప‌వ‌న్‌.. ఇలాంటి షాకుల‌కు మాన‌సికంగా ప్రిపేర్ అయ్యార‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. పార్టీకి త‌న రాజీనామా లేఖ‌ను పంపిన రావెల‌.. అనంత‌రం ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌తో భేటీ అయ్యారు. దీంతో.. ఆయ‌న త‌ర్వాత చేర‌బోయే పార్టీ బీజేపీ అన్న విష‌యంపై స్పష్ట‌త వ‌చ్చిన‌ట్లుగా చెప్పాలి. ఇదిలా ఉంటే.. రేపు తిరుప‌తికి వ‌స్తున్న‌ ప్ర‌ధాని మోడీ స‌మక్షంలో రావెల బీజేపీలో చేరే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. రావెల‌తో పాటు ప‌లువురు టీడీపీ నేత‌లు కూడా బీజేపీలో చేరే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌క‌తప్ప‌దు.


Tags:    

Similar News