చంద్రబాబు... సీతయ్యను మించినోడు అని చాలాకాలంగా టాక్. ఎవరి మాట వినడు. విన్నట్టు నటించి తన నిర్ణయం తాను తీసుకుంటాడు. ఇప్పటికి చాలామంది ఆయన మాజీ సహచరులు - మాజీ టీడీపీ నేతలు ఈ విషయం వెల్లడించారు. ఓ ప్రాంతీయ పార్టీలో ఉంటూ ఆ పార్టీ గురించి ఆ పార్టీలో ఉండగా చెప్పే ధైర్యం ఎవరికీ ఉండదు. అందుకే ఇటీవల ఆ పార్టీకి రాజీనామా ఇచ్చి జనసేనలో చేరిన రావెల కిషోర్‌బాబు కొన్ని సీక్రెట్లు బయటపెట్టారు.
*నన్ను టీడీపీ అధినేత - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్ లో చేర్చుకున్నారు. చాలా గర్వంగా ఫీలయ్యాను. తర్వాత నాకు అర్థమైంది. అదంతా పైపైకే అని. నన్ను మంత్రిని చేసినా అధికారాలు మాత్రం ఆయన వద్దే పెట్టుకున్నారు* అని మాజీ మంత్రి రావెల్ కిశోర్ బాబు వెల్లడించారు. అన్ని విషయాల్లో అన్ని నిర్ణయాలు మా పేరుపై చంద్రబాబే తీసుకుంటారని రావెల చెప్పారు. పదవి ఉండీ ఏమీ చేయలేని పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఆత్మాభిమానం చంపుకోలేక పోయాను. దీంతో అలాంటి పదవిలో - పార్టీలో ఉండటం కంటే రాజీనామా చేయడమే మేలనిపించి రాజీనామా చేశానన్నారు.
విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో భార్యతోపాటు వెళ్లి జనసేన కండువా కప్పుకున్న సందర్భంగా కిశోర్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, అదే సమయంలో ... పవన్ కళ్యాణ్ ఆయనకు మంత్రి పదవి ఖరారు చేశారు. వచ్చే ఏడాది రావెల కిశోర్ బాబు ఎమ్మెల్యే అవుతారు. మంత్రి కూడా అవుతారు అంటూ పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇదిలా ఉంటే... రావెల పార్టీలో చేరికపై జనసేన నేతలలో గాని - కార్యకర్తల్లో గాని పెద్దగా స్పందన లేదు.