ఏపీలో ఓ వైపు ఎన్నికల జోరు మొదలవుతుంటే మరోవైపు రాజకీయ నేతలు పరస్పర విమర్శలు సైతం అదే రీతిలో సాగుతున్నాయి. తాజాగా, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి - ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆయన టీడీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే..!విజయవాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీతోనే ఆయన జనసేన పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. కాగా, పార్టీని వీడిన అనంతరం టీడీపీపై - రావెల కిషోర్ బాబు విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా రావెల - టీడీపీపై చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.
ఏలూరు జనసేన కార్యాలయంలో రావెల మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై సంచలన ఆరోపణలు చేశారు. కుల వివక్షత - స్వార్ధపూరిత రాజకీయాలు - ఒంటెద్దు పోకడ నచ్చక తాను టీడీపీని వీడినట్లు రావెల చెప్పారు..కుల వివక్షత నేరుగా కాకుండా పరోక్షంగా కొనసాగుతుందని, ఇది కావాలని చేసే దుశ్చర్య మాత్రమేనని రావెల చెప్పారు. జనసేన ఓట్లను తొలగించేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్లు ఆరోపణలు చేశారు. నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తొలగింపు జరుగుతుందని , ఒక ప్రైవేటు సర్వే సంస్థ గడచిన కొద్ది మాసాలుగా ఓట్లను తొలగించే కుట్రలో నిమగ్నమై ఉందని రావెల సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అనుకూల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతుందని ఆయన చెప్పారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే, నేరుగా శిరసా వహిస్తానని కిషోర్ బాబు తెలిపారు. కాగా, వచ్చే ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి జనసేన తరపున ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆయన పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.