అడుసు తొక్కనేల కాలు కడగనేల అంటారు. ఐతే మాస్ రాజా రవితేజ పరిస్థితి చూస్తున్న జనాలు బక్క చిక్కనేల.. ఇప్పుడు మళ్లీ బరువు పెరగనేల అంటున్నారు. సినిమా హీరోలన్నాక వయసు ప్రభావం కనిపించకుండా మేనేజ్ చేస్తుండాలి. ఎప్పటికప్పుడు బాడీని కంట్రోల్లో పెడుతుండాలి. ఐతే రవితేజ మరీ ఎక్కువ కంట్రోల్లోకి వెళ్లిపోయాడు. డైట్ అదీ బాగా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేసి బరువు తగ్గే ప్రయత్నం చేశాడు. ఇందుకోసం చాలా త్యాగాలే చేశానని చెప్పుకున్నాడు రవితేజ ఆ మధ్య. కానీ రిజల్ట్ మరీ ఎక్కువగా కనిపించింది. తగ్గాల్సిందానికంటే తగ్గిపోయి.. పేషెంట్ లాగా తయారయ్యాడు.
దీంతో ఇప్పుడు మళ్లీ బరువు పెరగాల్సి వస్తోంది. తన సినిమాల విషయంలో ఏమాత్రం రాజీ పడని దిల్ రాజు మాస్ రాజాకు బరువు పెరగాల్సిందేనని షరతు పెట్టడంతో అతను మళ్లీ బరువు పెరగడానికి సీరియస్ గానే ట్రై చేస్తున్నాడట. ఇంతకుముందు బరువు తగ్గడానికి డైటీషియన్‌ని పెట్టుకున్నట్లే.. ఇప్పుడు బరువు పెరగడం కోసం ఓ డైటీషియన్‌ని నియమించుకున్నాడట. ఏది పడితే అది తినేస్తే మళ్లీ అదో ఇబ్బంది తెచ్చిపెడుతుందని.. ఒక క్రమబద్ధంగా బరువు పెరగాలని చూస్తున్నాడట రవితేజ. అందుకే పాత షేప్ రావడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందట. ఎంతో కష్టపడి అప్పుడు బరువు తగ్గితే.. మళ్లీ అంతే కష్టంతో బరువు పెరగడానికి ప్రయత్నించడం మాస్ రాజాకు బాగా ఇబ్బందిగానే ఉందట. కానీ ఏం చేస్తాడు. సినిమా హీరో అన్నాక ఈ కష్టాలన్నీ తప్పవు కదా.