కాంగ్రెస్ పార్టీ నాయకురాలు - ఫైర్ బ్రాండ్ నేతగా పేరొందిన రేణుకా చౌదరి ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ఒకింత తక్కువ ఆసక్తిని చూపుతున్న సంగతి తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండే రేణుకా అక్కడి పరిణామాల గురించే తరచుగా స్పందిస్తుంటారు. కొద్దికాలం క్రితం బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి స్పందిస్తూ `క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు. అలాంటివి అన్ని చోట్లా జరుగుతుంటాయి. ఇది చేదు వాస్తవం` అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా తనదైన శైలిలో నిర్మొహమాటంగా మాట్లాడే రేణుకపై ఓ మహిళా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెతో పాటుగా టికెట్ల పేరుతో మోసం చేశారని సొంత పార్టీకే చెందిన నాయకుడు సైతం ఇదే రీతిలో విమర్శలు గుప్పించారు.
ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ నేత రవిచంద్ర చౌహాన్ ఇలా రేణుక తీరుపై ఘాటుగా స్పందించారు. రేణుక చేతిలో మోసపోయిన డాక్టర్ రాంజీనాయక్ గురించి మాట్లాడుతూ జాతీయ నాయకురాలిగా వ్యవహరిస్తూ రేణుకా చౌదరి తమను మోసం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ మీకేనంటూ...చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. డాక్టర్ రాంజీ నాయక్ దగ్గర 2014లో కోటి 30లక్షల రూపాయలు తీసుకున్నారని, తిరిగి డబ్బులు ఇవ్వమని అడిగినందుకు కేసులు పెట్టించారని అన్నారు. జాతీయ స్థాయి నాయకురాలిగా ఉన్న రేణుకా గిరిజనులను మోసం చేయడంతో పాటుగా తమపై దురుద్దేశపూరితంగా వ్యవహరించడం సరికాదని అన్నారు.
రాంజీనాయక్ భార్య కళావతి మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైరా టికెట్ ఇప్పిస్తానని చెప్పి తమ వద్ద కోటి 30లక్షలు రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. టికెట్ ఇప్పించకపోగా...నాలుగేళ్లుగా రేణుకా చౌదరిని డబ్బులు అడుగుతున్నాపట్టించుకోవటం లేదని రాంజీ నాయక్ భార్య వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కాంగ్రెస్ పెద్దలను కోరారు. ఈ నెల 14వ తేదీన తెలంగాణ పర‍్యటనకు రానున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి రేణుకపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని - అవసరమైతే ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తానన్నారు.