క్రికెట్ లో ఒక్కొక్కరికి ఒక్కొకసారి ‘‘టైమ్’’ వస్తుంది. గావస్కర్ నుంచి కోహ్లి వరకు.. మధ్యలో అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్ సహా అందరూ ఇలాంటి గొప్ప టైమ్ ను చూసినవారే. ఇలాంటి టైమ్ ను తెలుగులో కచ్చితంగా చెప్పాలంటే ‘‘మహర్దశ’’ అంటారు. అలాంటి మహర్దశే ఇప్పుడు రవీంద్ర జడేజాకు నడుస్తోంది. బ్యాట్ పడితే పరుగుల ప్రవాహం.. బంతి అందుకుంటే వికెట్ల వరద.. ఫీల్డింగ్ లోనూ తిరుగులేదు.. అంతా జడేజా మాయే.
ఇటీవలి శ్రీలంకతో తొలి టెస్టునే చూసుకుంటే జడేజా 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సైతం భారీ స్కోరు చేయలేకపోయినచోట జడేజా ఏకంగా సెంచరీనే బాదేసి నాటౌట్ గా మిగిలాడు. రెండు ఇన్నింగ్స్ లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. ఇదే కాదు శ్రీలంకతో టి20 సిరీస్ లోనూ జడ్డూ అద్భుతంగా రాణించాడు. అంతకుముందు గాయంతో జట్టుకు దూరమైనా.. వచ్చీ రాగానే తనదైన ముద్ర చూపుతున్నాడు.
మూడేళ్ల క్రితం వరకు సాధారణమే
2019 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా జడేజాపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరూ చూశారు. బిట్స్ అండ్ పీసెస్ ఆటగాడంటూ జడేజాపై మాట జారాడు మంజ్రేకర్. తర్వాత నాలుక్కర్చుకుని క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే కప్ సెమీఫైనల్లో జడేజా అద్భుత ఇన్నింగ్స్ తో జట్టును దాదాపు గెలిపించినంత పని చేశాడు. కాగా, జడేజా ప్రతిభావంతుడే అయినా.. 2019 వరకు అతడికి దక్కిన గౌరవం అంతంతే.
స్వదేశంలో అయితే స్పిన్ పిచ్ లు కాబట్టి అతడికి టెస్టు జట్టులో చోటు కచ్చితంగా ఉండేది. విదేశాల్లో మాత్రం ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ తర్వాతనే జడేజా గురించి ఆలోచించేవారు. అలాంటి జడేజా మూడేళ్లుగా మరింత రాటుదేలాడు. ఇప్పుడు మూడు జట్లలోనూ అతడికి తుది 11 మందిలో స్థానం ఖాయంగా ఉంటోంది. ఇక్కడ ఎక్కువగా చెప్పుకోవాల్సింది జడ్డూ బ్యాటింగ్ గురించి. 2019 తర్వాత అతడి బ్యాటింగ్ మరో స్థాయికి వెళ్లింది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మూడు ట్రిపుల్ సెంచరీలు
2008 ప్రపంచ కప్ గెలిచిన అండర్ 19 జట్టు సభ్యుడైన జడేజా.. కోహ్లి కంటే ఏడాది ఆలస్యంగా 2009లో టీమిండియాలోకి వచ్చాడు. కానీ.. కొన్నేళ్లపాటు తనదైన ముద్ర చూపలేకపోయాడు. తర్వాత జట్టుకు దూరమయ్యాడు. వస్తూ పోతూ ఉండసాగాడు. ఆ సమయంలో జట్టు కూర్పు కూడా అలానే ఉండేది. టీంకు పూర్తిగా దూరమైన స్థితిలో 2017 సంవత్సరం అతడి జాతకం మార్చింది. రీ ఎంట్రీలో దుమ్మురేపిన జడేజా టీమిండియాలో సుస్థిర స్థానం ఏర్పర్పుకున్నాడు. ఎలాగూ ఫీల్డింగ్ లో తిరుగులేనివాడు కావడం అదనపు బలంగా మారింది.
చెన్నై సూపర్ కింగ్స్ కే కాదు.. టీమిండియా భవిష్యత్ సారథిగానూ..
జడేజాను ఈ ఏడాది ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ రూ.16 కోట్లతో రిటైన్ చేసుకుంది. కాగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి రూ.12 కోట్లు మాత్రమే ఇచ్చిన చెన్నై.. జడేజాకు అంతకుమించి ఇవ్వడం గమనార్హం. సీఎస్కే చరిత్రలో ధోనికి మించి ఓ ఆటగాడికి ఎక్కువ డబ్బులివ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. సీనియర్ బ్యాటర్ సురేశ్ రైనాను ఎలాగూ సీఎస్కే వదులుకుంది. ధోని ఈ ఏడాది మాత్రమే ఐపీఎల్ ఆడేలా ఉన్నాడు. కాబట్టి సీఎస్కే తదుపరి కెప్టెన్ జడేజానే.
అంతేకాదు.. ఫామ్ ఇలాగే కొనసాగితే టీమిండియాకూ అతడే భవిష్యత్ సారథి అనడంలో సందేహం లేదు. 34 ఏళ్ల కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత జడేజాకే ఎక్కువ అవకాశాలుంటాయనడంలో సందేహం లేదు. కేఎల్ రాహుల్ అత్యంత నిలకడగా ఆడితే తప్ప.. జడేజాదే తదుపరి కెప్టెన్ కిరీటం అనడంలో సందేహం లేదు.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్ అతడే..
ఐసీసీ తాజాగా వెల్లడించిని ర్యాంకుల్లో జడేజా టెస్టు ఫార్మాట్ ఆల్‌రౌండర్ విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2017 ఆగస్టులోనూ ఇతడు ఓసారి టాప్ లోకి వచ్చాడు. అయితే, వారం పాటు మాత్రమే కొనసాగాడు. తాజా ర్యాంకింగ్స్లో బ్యాటింగ్ విభాగంలో 17 స్థానాలు ఎగబాకి 37వ ర్యాంకులోకి, బౌలింగ్ విభాగంలో 17వ ర్యాంకు దక్కించుకున్నాడు. మరో ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో టీమ్‌ఇండియా కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (5), రోహిత్ శర్మ (6), రిషభ్ పంత్ (10) స్థానాలు దక్కించుకున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ (2), జస్ప్రీత్ బుమ్రా (10) స్థానాల్లో నిలిచారు.