జ‌డేజా వైఫ్ పై కానిస్టేబుల్ భౌతిక‌దాడి

Update: 2018-05-22 04:09 GMT
టీమిండియా స్పిన్న‌ర్ ర‌వీంద్ర జ‌డేజా స‌తీమ‌ణిపై ఒక పోలీస్ కానిస్టేబుల్ దాడికి పాల్ప‌డిన వైనం సంచ‌ల‌నంగా మారింది. త‌ప్పుడు ప‌ని చేసి మ‌రీ.. ఆగ్ర‌హంతో జ‌డేజా స‌తీమ‌ణిని గాయ‌ప‌ర్చ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. సంచ‌ల‌నంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

సోమ‌వారం షాకింగ్ కు బ‌య‌లుదేరారు జ‌డేజా స‌తీమ‌ణి రీవా సోలంకి. ఆమె న‌డుపుతున్న బీఎండ‌బ్ల్యూ కారును రాంగ్ రూట్ లో వ‌స్తున్న కానిస్టేబుల్ అహిర్ ప‌ల్స‌ర్ ఢీ కొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో రెండు వాహ‌నాలు స్వ‌ల్పంగా దెబ్బ తిన్నాయి. వెంట‌నే కారు ఆపిన జ‌డేజా స‌తీమ‌ణి కారు దిగి.. దెబ్బ‌లు ఏమైనా త‌గిలాయా? అని కానిస్టేబుల్ ను వాక‌బ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

దీనికి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన స‌ద‌రు కానిస్టేబుల్ ఆమెపై భౌతిక దాడికి య‌త్నించారు. ఒక ద‌శ‌లో ఆమె జుట్టు ప‌ట్టుకొని కొడుతుంటే తాము రక్షించిన‌ట్లుగా స్థానికులు చెబుతున్నారు. కానిస్టేబుల్ దాడితో గాయాలైన ఆమెను ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. ఆసుప‌త్రికి వెళ్లిన రీవాను జామ్ న‌గ‌ర్ ఎస్పీ ప్ర‌దీప్ క‌లుసుకున్నారు. స్వ‌యంగా తానే ద‌గ్గ‌ర ఉండి స్టేష‌న్ కు తీసుకొచ్చి మ‌రీ పోలీస్ కానిస్టేబుల్ చేసిన దారుణంపై స్టేట్ మెంట్ తీసుకున్నారు.

అనంత‌రం స‌ద‌రు పోలీస్ కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. మ‌హిళ‌పై దాడికి పాల్ప‌డ‌టం తీవ్ర‌మైన నేర‌మ‌ని.. దీనిపై విచార‌ణ జ‌రిపి కానిస్టేబుల్‌పై ఎఫ్ ఐఆర్ న‌మోదు చేస్తామ‌న్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించింది.
Tags:    

Similar News