తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆపరేషన్ ఆకర్ష్ అందరికి బాగా తెలిసిన రాజకీయం. వైఎస్ పుణ్యమా అని.. తెలుగు రాష్ట్రాల ఇద్దరు చంద్రుళ్లు విపక్షాలకు వణుకు పుట్టేలా చేయటం తెలిసిందే. ఇక్కడిలా చేస్తుంటే.. బీజేపీ మరో తరహా రాజకీయాల్ని మొదలెట్టింది. తనకు అనుకూలంగా లేని కొన్ని రాష్ట్రాల్లో అక్కడి అధికారపార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల్ని ఆకర్షించటం.. వారిలో వారికి చీలిక తీసుకొచ్చి.. అలా బయటకు వచ్చిన వారికి తమ ఎమ్మెల్యేల్ని కలిపేసి అధికారాన్ని చేజిక్కించుకునే ప్రక్రియను మొదలెట్టింది.
ఈ తరహా రాజకీయాలతో అరుణాచల్ ప్రదేశ్ లో అధికారాన్ని తమ పేరిట మార్చుకున్న బీజేపీ.. తాజాగా అదే విధానాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలోని అధికారపక్షమైన కాంగ్రెస్ కు చెందిన 10 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వల విసిరింది. గత కొద్దిరోజులుగా తెర వెనుక సాగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావటంతో శుక్రవారం నుంచి తమ ఆపరేషన్ ను తెర మీదకు తెచ్చేశారు.
కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు కమలనాథ ఎమ్మెల్యేలు జత కలిసి గవర్నర్ కేకే పాల్నుకలిశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మెజార్టీ లేదని.. ఆ ప్రభుత్వం మైనార్టీలో ఉన్నందున డిస్మిస్ చేయాలని డిమాండ్ చేసింది. దీంతో.. తాను తాజా పరిణామాల్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తాజా పరిణామాలతో కాంగ్రెస్ బిత్తరపోయినా.. దిద్దుబాటు చర్యలు షురూ చేసింది.
తమ ప్రభుత్వానికి బలం ఉందని ముఖ్యమంత్రి హరీశ్ రావత్ చెబుతున్నారు. బీజేపీ నేతలు చెబుతున్న అంకెలన్నీ తప్పులని.. తమ సర్కారుకు పూర్తి మద్దుతు ఉందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ నేతలు అధికారదాహంతో అన్యాయంగా వ్యవహరిస్తున్నారని.. తొలుత అరుణాచల్ ప్రదేశ్ లో వ్యవహరించిన తీరునే.. తాజాగా ఉత్తరాఖండ్ లోనూ అదే విధానాన్ని అమలు చేస్తున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదంటూ విరుచుకుపడుతున్నారు. అధికార మార్పిడి మీద దృష్టి పెట్టిన కమలనాథులకు.. విలువల గురించి చెప్పే మాటలు వినిపించే అవకాశం ఉందంటారా..?