కొత్త రూల్: ఏటీఎంలో క్యాష్ లేకుంటే ఫైన్!

Update: 2019-06-15 06:06 GMT
కంటి ముందు ఏటీఎంలు క‌నిపించినా.. క్యాష్ లేకుండా ఖాళీగా ద‌ర్శ‌న‌మిచ్చేవెన్నో. ఇక‌పై.. అలాంటి చింత‌లు తీర‌నున్నాయి. తాజాగా రిజ‌ర్వ్ బ్యాంక్ ఇండియా కొత్త విధానాన్ని తెర మీద‌కు తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఏటీఎంల‌లో న‌గ‌దు లేకుండా ఖాళీగా ఉంటే బ్యాంకుల్లో భారీగా ఫైర్ వేసేందుకు వీలుగా కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. ఏ ఏటీఎం అయినా స‌రే.. మూడు గంట‌ల పాటు క్యాష్ లేకుండా ఖాళీగా ఉంచితే.. ఆ బ్యాంకు మీద భారీగా ఫైన్ వేయాల‌న్న ఆలోచ‌న చేస్తోంది.

న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాలు.. చిన్న ప‌ట్ట‌ణాల‌తో స‌హా గ్రామీణ ప్రాంతాల్లోనూ ప‌లు ఏటీఎంల‌లో నో క్యాష్ బోర్డులు ద‌ర్శ‌న‌మివ్వ‌టం తెలిసిందే. ఇలాంటి తీరును మార్చుకోవాల్సిందిగా బ్యాంకుల్నిఆర్ బీఐ కోరుతోంది. ఏటీఎంల‌లో క్యాష్ అయిపోయింద‌న్న విష‌యం స‌ద‌రు బ్యాంకుల‌కు ఎలా తెలుస్తుంద‌న్న సందేహం అక్క‌ర్లేదు. ఎందుకంటే.. ప్ర‌తి బ్యాంకు ఏటీఎంకు.. ఏటీఎం మిష‌న్లో ఎంత క్యాష్ ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించి.. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం ఇచ్చే వ్య‌వ‌స్థ ఉంది.

కానీ.. బ్యాంకుల నిర్ల‌క్ష్యం.. మ‌రి ఇత‌ర కార‌ణాల‌తో ఏటీఎంల‌ను స‌రిగా నిర్వ‌హించ‌ని ప‌రిస్థితి ఉంది. ఏటీఎంల‌లో నో క్యాష్ బోర్డు ఉంచ‌టంతో ప‌లువురు ఖాతాదారులు బ్యాంకుల్లో డ‌బ్బులు డ్రా చేసుకుంటున్నారు. దీంతో.. సిబ్బందిపై ప‌ని భారం పెర‌గుతోంది.

ఈ నేప‌థ్యంలో కొత్త నిబంధ‌న‌ల్ని తీసుకురావాల‌ని ఆర్ బీఐ నిర్ణ‌యించింది. అంతేకాదు.. సెప్టెంబ‌రు చివ‌రి నాటికి ఏటీఎం కేంద్రాల్లో భ‌ద్ర‌త‌ను భారీగా పెంచాల‌ని ఆర్ బీఐ సూచ‌న చేసింది. సీసీ టీవీ క‌వ‌రేజ్ పెంచ‌టం.. ఏటీఎంల‌ను గోడ‌లు.. ఫిల్ల‌ర్లు.. ఫ్లోర్ కు అటాచ్ చేసేలా ఏర్పాటు చేయాల‌ని సూచించింది. మ‌రి.. ఆర్ బీఐ కొత్త నిబంధ‌న ఎంత‌మేర అమ‌ల‌వుతుందో చూడాలి. ఇదంతా బాగుంది.. ప‌నిలో ప‌నిగా.. ఏటీఎంల‌లో క్యాష్ లేని విష‌యాన్ని తెలియ‌జేసే వారికి ఏదైనా బ‌హుమ‌తి ఇచ్చే విష‌యం మీద కూడా ఆర్ బీఐ ఆలోచిస్తే.. దెబ్బ‌కు బ్యాంకులు దారికి రావ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News