అధికారం చేతిలో ఉన్నది కదాని దూకుడుగా వ్యవహరిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో.. కేసీఆర్ సర్కారుకు బహుశా ఇప్పుడు స్వానుభవంలోకి వస్తూ ఉండాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నకిలీ ఓట్లను తొలగించడంపై రీ వెరిఫికేషన్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం అనేది చాలా కీలకమైన పరిణామం. ప్రజల భావోద్వేగాలు - అభిప్రాయాలు ముడిపడి ఉండే ఎన్నికల బరిలో కేసీఆర్ ను ఓడించగలరో లేదో గానీ.. సాంకేతికకారణాల మీద ప్రభుత్వ నిర్ణయాలు,విధానాల మీద విపక్షాలు అన్నీ ఉమ్మడిగా కాకపోయినా విడివిడిగా పోరాడి సాధించిన విజయంగా దీనిని అభివర్ణించాలి.
హైదరాబాదులో ఉన్నదంతా నకిలీ ఓట్లే అన్న తరహాలో తాను పాలన పగ్గాలు చేతపట్టిన తరువాత.. ఒక దశలో కేసీఆర్ చాలా రెచ్చిపోయారు. ఒక నగరంలో ఉన్న నకిలీ ఓటర్లు రాష్ట్ర ప్రభుత్వాన్నే నిర్దేశించేస్తున్నారంటూ కాస్త అతిశయోక్తులు కూడా జతచేశారు. ఆ తర్వాత ఆధార్ తో ముడిపెట్టి నకిలీ ఓట్లను ఏరివేసే కార్యక్రమం ప్రారంభించారు. నిజానికి ఆధార్ అనేది ఏ ప్రభుత్వ పథకానికి ముడిపెట్టడానికి వీల్లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో.. రూటు మార్చారు. వెరిఫికేషన్ నిర్వహించి పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించారు.
అయితే ఆంధ్రోళ్ల ఓట్లను పనిగట్టుకుని తొలగించారని,తమకు బలం లేని నియోజకవర్గాల్లో ఓట్లు తొలగించారని.. ఇలా ఈ తీరుపై పలు విమర్శలు వచ్చాయి. విపక్షాలు కేవంల విమర్శలతో వదలిపెట్టలేదు ప్రధానంగా కాంగ్రెస్ - తెలుగుదేశం, భాజపాలు ఓట్ల తొలగింపులో అరాచకంగా వ్యవహరించారంటూ ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ ను - గవర్నరును పలుమార్లు కలిసి విన్నవించారు. రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అంశానిన భుజానికెత్తుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఏకంగా ఢిల్లీ వెళ్లి ఈసీని కలిసి.. ఫిర్యాదులు చేశారు. ఎట్టకేలకు వారు స్పందించి, రాష్ట్రసర్కారు - రాష్ట్ర ఎన్నికల సంఘంతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రతినిధులను పంపి.. ఒక ప్రాథమిక విచారణచేయించారు. అందులో గమనించిన అంశాలను బట్టి మొత్తం తొలగించిన ఓట్ల విషయంలో పూర్తి స్థాయి రీ వెరిఫికేషన్ జరగాల్సిందేనంటూ.. తాజాగా బుధవారం ఆదేశాలు వచ్చాయి.
కేసీఆర్ సర్కారుకు ఇది కేంద్ర ఈసీ నుంచి పెద్ద దెబ్బగానే పరిగణించాలి. అయితే ఇది పూర్తిగా ఆయన దూకుడు మీద విపక్షాలు సాధించిన విజయం అనేపేర్కొనాలి.