రీల్ లో కనిపించే చాలా సీన్లు రియల్ గా జరుగుతుంటాయి.కానీ.. చాలావరకు బయటకు రావు. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఈ కోవలోకే వస్తుంది. తాజాగా ఒక క్రికెట్ ప్రముఖుడు చెప్పాడు కాబట్టి బయటకు వచ్చింది కానీ మామూలుగా అయితే.. ఇలాంటివి బయటకు వచ్చే అవకాశమే ఉండదు. మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ తెలుసు కదా. అతగాడు ఒక యూట్యూబ్ చానల్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రచారంలోకి రాని విషయాలతో పాటు.. కొందరికి సంబంధించి షాకింగ్ నిజాల్ని వెల్లడించారు.
మాజీ క్రికెటర్.. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ కు సంబంధించిన విషయాల్ని రివీల్ చేశాడు. అతగాడి గురించి విన్న తర్వాత ఇంత గొప్ప అటగాడిని మిస్ అయ్యామా? అన్న భావన కలుగకమానదు. ఎందుకంటే.. అతడికి వచ్చిన పేరుతో పోలిస్తే.. రావాల్సిన పేరు ప్రఖ్యాతులే ఎక్కువన్న విషయం లక్ష్మీపతి బాలాజీ మాటలు చెబుతాయి.
తాను రంజీ క్రికెట్ ఆడే సమయం నుంచే బద్రీనాథ్ గురించి తెలుసని చెప్పాడు. బద్రీనాథ్ బ్యాటింగ్ నెమ్మదిగా బ్యాట్ చేస్తారని చెబుతారని.. కానీ అతడిలో వేరే కోణం ఉందని.. చాలా తక్కువమందికే తెలుసని చెప్పాడు. పరిస్థితులకు తగ్గట్లు తనను తాను మార్చుకోవటం ఆయనకు మించినోడు ఉండరని చెప్పాడు. స్లోగా ఆడతాడన్న పేరున్నా.. అతడి వికెట్ తీసుకోవటం చాలా కష్టమన్నాడు. అంతేకాదు.. బౌలర్ల మీద అతగాడి అధిపత్యం ఎలా ఉంటుందో శాంపిల్ గా చెప్పుకొచ్చాడు.
రంజీట్రోఫీలో తన తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టటమే కాదు.. మ్యాచ్ కు గంట ముందే తాను సెంచరీ కొడతానని చెప్పి మరీ శతకొట్టటం అతడికే సాధ్యమని చెప్పాడు. మహారాష్ట్రతో జరిగిన రంజీ మ్యాచ్ లో డిహైడ్రేషన్ కు గురయ్యాడని.. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారన్నాడు. అయితే.. తమిళనాడు వికెట్లు వెంట వెంటనే పోతున్న వేళ.. అంబులెన్సులో వచ్చిన అతడు క్రీజ్ లోకి దిగి సెంచరీ కొట్టిన ధీశాలిగా చెప్పుకొచ్చాడు. బద్రీకి సంబంధించి ఇలాంటి విషయాలు ఏమీ బయటకు తెలీవని.. అతగాడి గొప్పతనాన్ని తన యూట్యూబ్ షోలో తెగ పొగిడేశాడు.