నిజంగానే కరోనా.. పురుష ద్వేషి.. షాకింగ్ నిజాలు బయటకు

Update: 2022-07-16 14:30 GMT
ప్రపంచానికి నిద్ర లేకుండా చేసి.. తీవ్రమైన భయాందోళనలకు గురి చేసిన కరోనాకు సంబంధించిన పలు రిపోర్టులు ఇప్పటివరకు బయటకు రావటం తెలిసిందే. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న వేళలో.. ఈ వైరస్ బారిన పడినోళ్లలో ఎక్కువ మంది పురుషులే ఉండటం.. మహిళలకు తక్కువగా సోకటం తెలిసిందే. దీంతో.. కరోనాను పురుష ద్వేషిగా కొందరు అభివర్ణించటం తెలిసిందే. తాజాగా వెల్లడైన ఒక అధ్యయ రిపోర్టు షాకింగ్ గానే కాదు.. నిజంగానే కరోనా మహమ్మారి పురుష ద్వేషి అన్న సందేహం కలిగించక మానదు.

యూకేకు చెందిన యూరాలజిస్టు కమ్ పెల్విక్ సర్జన్ అయిన డాక్టర్ రీనా మాలిక్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. పషాకింగ్ నిజాల్ని వెల్లడించారు. కరోనా బారిన పడిన పురుషుల్లో చాలామందికి.. దాని నుంచి కోలుకున్న తర్వాత అంగస్తంభన సమస్యను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. కొవిడ్ బారిన పడినప్పుడు అది రక్త నాళాల పొరను ప్రభావితం చేస్తుందని.. దీంతో శరీరంలోని ఒక భాగం నుంచి మరో భాగానికి రక్తాన్ని అందించే విషయంలో సమస్యలు ఏర్పడుతున్న వైనాన్ని గుర్తించినట్లు తెలిపారు.

ఈ కారణంతో పురుషాంగానికి సరఫరా అయ్యే రక్త ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడుతున్నట్లుగా పేర్కొన్నారు. కొవిడ్ బారిన తర్వాత పలువురిలో అంగస్తంభన ముప్పు ఐదు రెట్లు ఉంటుందని .. అంగానికి రక్త ప్రసరణ తగ్గటం వల్ల అంగం కుంచించుకుపోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని వెల్లడించారు. దడ పుట్టించేలా ఉన్న ఈ వాదనకు బలం చేకూరేలా కొందరు తమ అనుభవాన్ని వెల్లడించటం గమనార్హం.

మెల్ బోర్న్ కు చెందిన కొవిడ్ బాధితుడు స్థానిక మీడియాతో మాట్లాడే సందర్భంలో తాను వైరస్ బారిన పడిన తర్వాత అంగస్తంభన సమస్యను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. అంగస్తంభన చాలా కష్టంగా మారిందని వెల్లడించారు. కరోనాకు ముందు తాను సుమారు అరగంట పాటు సెక్సు చేసేవాడినని.. ఇప్పుడు అది కాస్తా పది నిమిషాలకు పడిపోయినట్లు చెప్పారు.

అంతేకాదు వరల్డ్ జర్నల్ ఆఫ్ మెన్స్ హెల్త్ లోనూ ఒక అధ్యయన రిపోర్టును ప్రచురించారు. అందులోనూ కొవిడ్ బారిన పడిన పురుషుల పురుషాంగ రక్తనాళాలు దెబ్బ తిన్నట్లుగా గుర్తించారు. కొవిడ్ తర్వాత కొన్ని నెలల వరకు వైరస్ పురుషాంగంలో కొనసాగుతుందని.. సెక్సు చేయటం కష్టంగా ఉంటుందన్న వాదనను వినిపిస్తున్నారు.

ఇదంతా భయపెట్టటానికో.. సంచలనం కోసమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న వివిధ వాదనల్ని అందరికి చెప్పే ప్రయత్నమే అన్నది గుర్తించాలి. ఒకవేళ.. ఇక్కడ పేర్కొన్న సమస్యలు ఎవరికైనా ఎదురైతే.. అనవసర ఆందోళనకు గురి కావటం కంటే కూడా వైద్యుల్ని సంప్రదించి సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. పలు అధ్యయనాల వివరాల్ని మాత్రమే ఇక్కడ చెప్పటం జరిగిందన్న విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు.
Tags:    

Similar News