టీడీపీ అధినేత తన పార్టీ తరఫున పోటీ చేసే అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించిన తుది లిస్ట్ ను విడుదల చేశారు. ఈ జాబితాలో కొందరి పేర్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. అలాంటి పేర్లలో ఒకటి బండారు శ్రావణి. అనంతపురం జిల్లా శింగనమల టీడీపీ అభ్యర్థిగా ఆమెను ఖరారు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమెకుఎందుకు టికెట్ ఇచ్చారు? సిట్టింగ్ యామిని బాలకు హ్యాండిచ్చిన బాబు.. బండారు శ్రావణికి ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చారు? ఆమెకు టికెట్ రావటంలో ఎవరి పాత్ర ఉంది? అన్న విషయాల్లోకి వెళితే..
ఎస్సీ రిజర్వడ్ స్థానమైన శింగనమల అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాలకు టికెట్ కన్ఫర్మ్ అని అందరూ అనుకున్నారు. అయితే.. బాబు చేయించిన సర్వేల్లో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావటంతో ఆలోచనలో పడ్డారు. దీంతో.. ఆ సీటుకు అభ్యర్థిని ఫైనల్ చేయలేదు. యామిని బాలకు ప్రత్యామ్నాయంగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుదన్న వెతుకులాట విషయం జేసీకి తెలియటంతో ఆయన ఎంట్రీ ఇచ్చారు.
ఆయన సిఫార్సుతో బాబు బండారు శ్రావణిని ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే తాజాగా ఎంపిక చేసిన శ్రావణి ఎవరో కాదు.. 2014లో టీడీపీ అభ్యర్థిగా మొదట టికెట్ లభించి.. తర్వాత పోటీకి వెనక్కి తగ్గిన బండారు రవికుమార్ కుమార్తె. వ్యక్తిగత కారణాలతో పోటీ నుంచి దూరమైనప్పటికీ.. పార్టీ నిలబెట్టిన యామిని బాల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. అనంతరం బండారు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
ప్రజల్లో పలుకుబడితోపాటు.. తన రాజకీయ వారసురాలిగా తన కుమార్తెను రంగంలోకి తీసుకొచ్చారు. వీరికి జేసీ దివాకర్ రెడ్డి అండదండలు కూడా ఉండటంతో కలిసి వచ్చింది. యామినాబాలపై వ్యతిరేకత ఉండటం.. శ్రావణిపై సానుకూల రిపోర్టులు రావటంతో ఆమెకు టికెట్ కేటాయించేందుకు బాబు సిద్ధమయ్యారు. అదే టైంలో జేసీ ఎంటర్ అయి.. శ్రావణికి టికెట్ ఇవ్వండి.. గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానన్న భరోసా ఇవ్వటంతో బాబు ఆమెకు టికెట్ ఫైనల్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి.. బాబుకు ఇచ్చిన మాటను జేసీ ఎంతవరకూ నిలబెట్టుకుంటారో తుది ఫలితం వస్తే కానీ తేలదు.