ఐటి. ఆదాయ పన్ను శాఖ. ఈ మాట వింటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు వణుకుతున్నారు. దీనికి కారణం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆదాయ పన్ను శాఖ అధికారులు అధికారులు ఆంధ్రప్రదేశ్ లో తమ దాడులను ముమ్మరం చేసారు. ఎవరి మీద చేశారు ఈ దాడులు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులపైనా - వారి అనుచరులపైనా... ఆ పార్టీ సానుభూతి పరులపైనా ఈ దాడులు ఎక్కువయ్యాయి. గతంలో ఐటి దాడులపై పెద్దగా స్పందించని చంద్రబాబు నాయుడు ప్రస్తుత దాడులపై మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. అంతే కాదు తనను - తన పార్టీ నాయకులను భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేస్తోందని ఆయన కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. అయితే ఈ అక్కస్సంతా కూడా తన సామాజిక వర్గానికి చెందిన వారి ఇళ్లలోను - చంద్రబాబు నాయుడుకు బినామీలు వ్యవహరిస్తున్న కొందరి తెలుగుదేశం నాయకుల ఇళ్లపైనా జరుగుతుండడమే అని ప్రతిపక్షాలు అంటున్నాయి.
గత నాలుగేళ్లలో తెలుగుదేశం నాయకుల ఇళ్లపై ఎన్ని దాడులు జరిగినా పట్టనట్టు వ్యవహరించిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం స్పందిస్తున్న తీరు ఒకింత ఆశ్చర్యంగానే ఉందని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. గత సంవత్సరం మేలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారయణ రెడ్డి 200 కోట్ల రుపాయల అక్రమ ఆస్తులు ఉన్నాయని ఆయన ఇంటిపై ఐటి దాడులు జరిగాయి. అలాగే అదే పార్టీకి చెందిన అనంతపురం ఎమ్మెల్సీ జే.సీ.దీపక్ రెడ్డి - ఆయన అల్లుడు ఎంపీ జే.సీ. దివాకర్ రెడ్డి కూడా అక్రమ ఆస్తులు కూడ బెట్టారంటూ అరెస్టు కూడా చేసారు. సెప్టెంబరు 2016లో టీడిపి ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి ఇంట్లో, చిత్తూరు ఎమ్మెల్యే డికె. సత్యప్రభ ఇంట్లో కూడా ఐటి దాడులు జరిగాయి. అయితే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ స్పందించ లేదు సరికదా... కనీసం మాట్లడలేదు. కాని ప్రస్తుతం ఆయన స్పందిస్తున్న తీరును చూసిన సొంత పార్టీ నాయకులే ఎదురుగా ఏమీ మాట్లాడలేక లేక లోలోపలే మదనపడుతున్నట్లు సమాచారం. తన వర్గం వారిపైనా.... తన కులానికి చెందిన వారిపైనా దాడులు జరిగితే స్పందిస్తున్న తీరు చంద్రబాబునాయుడు ఆయన స్వంత కులం చేతుల్లో ఎలా బందీ అయిపోయారో చెప్పకనే చెబుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తన దాక వస్తే కాని బాబు గారి తత్వం బోధ పడలేదని తెలుగుదేశం పార్టీలోని తమ్ముళ్లే చెవులు కొరుక్కోవడం కొసమెరుపు.