తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి ఆపరేషన్ చేయించుకుంటారన్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన కేసీఆర్.. ఆ తర్వాత ఢిల్లీలోనే ఉండిపోయారు. కంటికి ఆపరేషన్ కారణంగా ఆయన దేశ రాజధానిలోనే ఉండిపోయారు.
తనకు గతంలో కంటి ఆపరేషన్ చేసిన డాక్టర్ సత్యదేవ్ చేతనే తాజా ఆపరేషన్ చేయించుకోవాలని కేసీఆర్ భావించారు. దీంతో ఆయన ఢిల్లీలో శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. కేసీఆర్ ఆపరేషన్ రేపు.. రేపు అంటూ వాయిదాల మీద వాయిదా పడుతోంది.
సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఆపరేషన్ ఎందుకు వాయిదా పడుతుందన్న ప్రశ్న తలెత్తటం ఖాయం. ఎందుకిలా అన్న అంశం మీద దృష్టి సారిస్తే.. అసలు విషయం బయటకు వచ్చింది. ముందుగా అనుకున్న దాని ప్రకారం సోమవారమే కేసీఆర్ కంటికి ఆపరేషన్ జరగాల్సి ఉంది. కానీ.. జరగలేదు. దీనికి కారణం.. ఆయన బీపీ.. షుగర్ లెవెల్స్ అనుకున్న స్థాయిలో కంట్రోల్ కాకపోవటమే. బీపీ.. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆపరేషన్ ను వాయిదా వేశారని చెబుతున్నారు.
అయితే.. ఈ కారణంతో పాటు.. ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్ సత్యదేవ్ అందుబాటులో లేకపోవటం కూడా కారణంగా చెబుతున్నారు. ఒక ముఖ్యమంత్రి శస్త్రచికిత్సకు మించిన పెద్ద పని ఉంటుందా? అన్న ప్రశ్నను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. శస్త్రచికిత్సకు ముందుస్తుగా చేయాల్సిన ఏర్పాట్లలో భాగంగా డాక్టర్ సత్యదేవ్ బృందానికి చెందిన వైద్యులు రోజూ కేసీఆర్ నివాసానికి వచ్చి.. ఆయన కంట్లో చుక్కలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. రేపు (గురువారం) ఆపరేషన్ జరిగే వీలుందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు అన్ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/