జ‌గ‌న్ భ‌లే నిర్ణ‌యం తీసుకున్నారు...

Update: 2015-07-12 18:27 GMT
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత‌, ఏపీ శాసనసభ ప్ర‌తిప‌క్ష‌నేత, వైఎస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ఒక్కోసారి త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌ను బ‌య‌ట‌పెట్టుకుంటారు. అనేక సంద‌ర్భాల్లో త‌న ఎమోష‌న్స్‌కు ప్రాధాన్యం ఇచ్చే జ‌గ‌న్ తాజాగా ప‌క్కా అవ‌గాహ‌న ఉన్న రాజ‌కీయ నాయ‌కుడిని అని నిరూపించుకున్నారు.

తెలుగు రాష్ర్టాల్లో గోదావ‌రి పుష్క‌రాలు ఘ‌నంగా సాగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి దాదాపు అన్ని పార్టీల నాయ‌కులు హాజ‌ర‌వుతున్నారు. అయితే స్వ‌త‌హాగా క్రిస్టియ‌న్ అయిన జ‌గ‌న్ పుష్కర స్నానం చేస్తారా? అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దీనికి ఆయన పార్టీ  శాసనసభ పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ స‌మాధానం ఇచ్చారు. పదిహేనో తేదీన జగన్ రాజమండ్రి వస్తారని, ఆ తర్వాత పుష్కర స్నానం ఆచరిస్తారని ఆయన చెప్పారు.

రాజకీయ నాయకులకు వ్యక్తిగత అబిప్రాయాలు ,నమ్మకాలు ఉన్నా, ప్రజల కోసం కొన్ని విషయాలలో వ్యవహరించవలసి ఉంటుంది అనే చాక‌చ‌క్యాన్ని జ‌గ‌న్ బాగానే ఒడిసిప‌ట్టుకున్నార‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News