కేంద్రంలో చక్రంతిప్పాలంటే.. జగన్ కోరిక ఆయనే..

Update: 2019-06-05 14:30 GMT
కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఎన్డీఏతో పనిలేకుండానే సొంతంగా బీజేపీనే 303 సీట్లను చేజిక్కించుకుంది. దీంతో బీజేపీ దేశంలో ఏ ఇతర ప్రాంతీయ పార్టీల బలం - బలగం.. అవసరం లేదు. అందుకే ఇప్పుడు మోడీ దేశంలో ఏమైనా చేయొచ్చు.. అడిగే వారే లేరు. అందుకే మోడీని మెప్పించి ఏపీకి నిధులు - హోదా రాబట్టాలంటే అంత ఈజీ అయిన పని కాదు..

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గడిచిన కొన్నేళ్లుగా జగన్ కు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో జగన్ కేసులు - ఇతర వ్యవహారాలు - పొత్తులు - మిత్రపక్షాలతో చర్చలు వంటివన్నీ చూస్తున్నారు. ఆయనకు ఢిల్లీలో పరిచయాలున్నాయి. అందుకే జగన్ మరో మాటకు తావులేకుండా వైసీపీ పార్లమెంటరీ పక్షనేతగా విజయసాయిరెడ్డిని  నియమించారు..

ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరం.. జగన్ ప్రధాని మోడీని కలిశాక కోరిన ఓకే ఒక్క కోరిక హోదానే.. ఆ హోదాను బీజేపీని ఒప్పించి తీసుకురావాలంటే కొత్త ఎంపీలతో సాధ్యం కాదు. అందుకే 22 మంది ఎంపీలు గెలిచినా.. ఏపీ తరుఫున నిధులు - ఇతర విషయాలు చక్కబెట్టే బాధ్యతను జగన్ విజయసాయిరెడ్డిపై ఉంచాడు..

ఏపీలో వైసీపీ సునామీలో 22 మంది ఎంపీలు గెలిచారు. కేవలం 3 సీట్లకే టీడీపీ పరిమితమైంది. ఆ 22 మంది సామాజిక సమీకరణాలను బట్టి  ఎంపీ బాలశౌరిని పార్లమెంటరీ పార్టీ నేతగా చేస్తారని వార్తలొచ్చాయి. కానీ ఆయన ఈసారే ఎంపీగా గెలిచాడు. దీంతో అనుభవం రీత్యా విజయసాయిరెడ్డి అయితేనే ఏపీకి న్యాయం జరుగుతుందని జగన్ ఈ ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది.


Tags:    

Similar News