మంగళవారం ఉదయం నిద్ర లేచి.. ఆగ్ర పత్రికల్ని చూసిన పలువురికి ఒక్కసారి ఆశ్చర్యానికి గురైన పరిస్థితి .ఇలాంటి అనుభవం హైదరాబాద్.. తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలకు ఎదురైంది. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీలో దీక్ష చేయనున్నారన్న వార్తే కారణం. ఉన్నట్లుండి తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్ వదిలిపెట్టి.. ఢిల్లీకి వెళ్లి మరీ దీక్ష చేసేంత పెద్ద విషయం ఏముందన్న సందేహంతో వార్తలోకి వెళ్లిన వారికి.. హైకోర్టు విభజన.. జడ్జిల నియామకానికి సంబంధించి అంశాలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కేసీఆర్ దీక్ష చేస్తారన్నది కన్ఫర్మ్ కానప్పటికీ.. అయ్యే అవకాశం ఉంటుందన్న అంచనాతో భారీగా ఇవ్వటం ఇక్కడ విశేషంగా చెప్పాలి.
ఎందుకిలా అంటే.. ఊహాగానాలతో.. అంచనాలతో వార్తలు అచ్చేసే పనిని అగ్ర మీడియా సంస్థలు వదిలేసి చాలాకాలమే అయ్యింది. కావాలంటే గడిచిన రెండేళ్ల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారపక్షాలకు సంబంధించిన ఏదైనా పెద్ద పరిణామాన్ని ముందే జరుగుతుందన్నట్లుగా వచ్చిన వార్త ఏమైనా వచ్చిందా? అన్నది చెక్ చేస్తే అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది.
మరి.. ఎప్పుడూ లేనిది.. కేసీఆర్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసే అవకాశం ఉందన్న విషయం ఎందుకంత ప్రయారిటీ ఇచ్చారన్నది చూస్తే అసలు విషయం ఇట్టే అర్థమువుతుంది. అత్యంత విశ్వసనీయ సమాచారం అంటూనే.. ‘అసలుకథ’ను నడిపించటమే కారణం. కొన్ని కీలక శక్తులు రంగంలోకి దిగి ముఖ్యమంత్రి మనసులోని మాటను చెప్పటం.. పక్కాగా చేయాలనుకుంటున్న విషయాన్ని తమదైన శైలిలో కన్ఫర్మ్ చేయటంతో కేసీఆర్ దీక్ష ప్రముఖ వార్తగా మారిపోయిందని చెప్పొచ్చు. నిజానికి ఈ వార్త వెనుక మరో వ్యూహం కూడా ఉందని చెబుతున్నారు.అగ్ర మీడియా సంస్థల్లో వచ్చే ప్రముఖ వార్తలకు ఎంతోకొంత స్పందన ఖాయం. అందులోకి ఇలాంటి పెద్ద విషయాలకు కేంద్రం నుంచి ఎంతోకొంత రియాక్షన్ ఉంటుందని.. వారి తీరును అనుసరించి తర్వాతి స్టెప్ వేయాలన్న ముందస్తు ఆలోచనతో దీక్ష మాట బయటకు వచ్చిందని చెబుతున్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు కోరుకున్నట్లే.. కేసీఆర్ దీక్ష పై కేంద్రమంత్రి సదానంద గౌడ రియాక్ట్ కావటంతో.. రానున్న రోజుల్లో ఎలా వ్యవహరించాలన్న అంశంపై ఇప్పుడు జోరుగా చర్చలు సాగుతున్నట్లు చెబుతున్నారు.