బుమ్రాను 'ప్రైమేట్' అని సారీ చెప్పింది... ఎవరీ ఈసా గుహా?

ప్రస్తుతం టీమిండియా ఆసిస్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆతిథ్య దేశంతో మూడో టెస్టు మ్యాచ్ ఆడుతోంది

Update: 2024-12-16 06:01 GMT

ప్రస్తుతం టీమిండియా ఆసిస్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆతిథ్య దేశంతో మూడో టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఈ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో బుమ్రా 6 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఈ మ్యాచ్ రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రాపై వ్యాఖ్యాత ఇషా గుహ ఓ పదం ప్రయోగించారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది.

ఇందులో భాగంగా... బుమ్రాపై ప్రశంసల జల్లులు కురిపించే క్రమంలో "మోస్ట్ వాల్యుబుల్ ప్రిమేట్" అనే పదం వాడింది. దీంతో... సోషల్ మీడియా వేదికగా గుహపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కారణం.. ఆమె చెప్పిన ప్రిమేట్ అనేది చింపాజీ క్యారెక్టర్ తో ఉన్న ఇంగ్లిష్ కామెడీ సినిమా. దీంతో నెటిజన్లు ఫైర్ అవ్వగా.. బుమ్రాకు గుహ సారీ చెప్పింది.

అవును... రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రాపై చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియా నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న గుహ.. మూడో రోజు ఆట ప్రారంభ సమయంలో క్షమాపణలు తెలిపింది. ఇందులో భాగంగా... ఆదివారం మ్యాచ్ సమయంలో కామెంట్రీ చేస్తూ తాను వాడిన పదం విపరీత అర్థాలకు దారితీసింది.. 'ఎవరినైనా బాధిస్తే క్షమాపణలు' అని చెప్పింది.

ఇదే సమయంలో... తాను ఇతరుల గౌరవానికి భంగం కలిగించేందుకు ఏనాడూ ప్రయత్నించనని.. తాను మాట్లాడింది మొత్తం వింటే బుమ్రాపై అత్యుత్తమ ప్రశంసలు కురిపించిన విషయం అర్ధమవుతుందని.. భారత గొప్ప ఆటగాళ్లను తాను ఏనాడూ తక్కువ చేయను అని.. క్రికెట్ కోసం పాటుపడే వారికోసం ఎల్లవేళలా ముందుంటానని ఆమె చెప్పుకొచ్చారు.

బుమ్రా విషయంలో ప్రశంసలు కురిపించే క్రమంలో పొరపాటు పదం వాడినట్లు అనుకుంటున్నానని.. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని ఆమె తెలిపారు. ఇక.. దక్షిణాసియా వార్సత్వం కలిగిన వ్యక్తిగా తాను ఎలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయలేదని అక్కడి అభిమానులు భావిస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు.

ఎవరీ ఈసా గుహ..?:

కేవలం 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఇసా గుహా. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన ఈమె ఇంగ్లండ్ తరుపున 8 టెస్టులు ఆడి 29 వికెట్లు పడగొట్టగా.. 83 వన్డేల్లో 101 వికెట్లు తీసింది. ఇదే క్రమంలో టీ20ల్లోనూ 18 వికెట్లు పడగొట్టింది. ప్రస్తుతం అత్యుత్తమ మహిళా వ్యాఖ్యాతలలో ఒకరిగా ఇసా గుహా రాణిస్తున్నారు.

Tags:    

Similar News