కేసీఆర్‌ పాతిక కోట్ల సాయం వెనుక...

Update: 2018-08-21 01:30 GMT
కేరళను వర్షాలు ముంచెత్తాయి. అక్కడి ప్రజల జీవితాలు అతలాకుతలం అయ్యాయి. దాదాపు వారం రోజులుగా కేరళ వాసులు నీటితోనే సావాసం చేస్తున్నారు. అయితే, కేరళకు తక్షణమే సాయం ప్రకటించింది మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావే. ఆయన ఏకంగా కేరళను ఆదుకుందుకు 25 కోట్ల రూపాయలు సాయం ప్రకటించారు. ఆయన తర్వాత పది కోట్ల రూపాయల సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చేసిన తక్షణ సాయానికి దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్పందించిన తీరుపై కూడా సర్వత్రా పశంసలు అందుతున్నాయి. ఇది మావవతా దృక్పథంతో చేసిందే అని అందరూ కొనియాడుతున్నారు. అయితే, ఏ పని చేసినా రాజకీయ ప్రయోజనాన్ని ఆశించే కె.చంద్రశేఖర రావు ఈ 25 కోట్ల రూపాయల సాయం వెనుక జాతీయ స్ధాయిలో రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.

జాతీయ స్ధాయిలో కాంగ్రెస్ - భారతీయ జనతా పార్టీలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్ కు గాని, జాతీయ రాజ‌కీయాల‌పై ప‌ట్టు కోసం గానీ కేరళ సాయం నాందీ వాచకం అంటున్నారు. తాను జాతీయ  రాజకీయాల్లో అడుగుపెడితే రాష్ట్రాల పట్ల తన నిర్ణయాలు ఎలా ఉంటాయనేది చెప్పేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఇలా ప్రకటించారని అంటున్నారు. నిజానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున కె.చంద్రశేఖర రావు సాయం ప్రకటించే సమయానికి కేరళలో ఇంత విపత్తు లేదు. అక్కడ వర్షాలు కురుస్తున్నాయి కాని, ఇంత బీభత్సం మాత్రం లేదు. అయినా తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం వెంటనే స్పందించారు. కేరళతో తెలంగాణకు ఏమంత ప్రయోజనాలు లేవు. కాని, అక్కడి ప్రజలను ఆదుకునేందుకు కె.చంద్రశేఖర రావు చేసిన సాయం జాతీయ స్ధాయిలో తన పేరు మారుమోగేందుకే అంటున్నారు. అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలుస్తుందని, తాను సారథ్యం వహిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌ పట్ల దేశ వ్యాప్తంగా ప్రజల్లో సానుభూతి వస్తుందనేది తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు రాజకీయ ఎత్తుగడగా అబివర్ణిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. తన జాతీయ రాజకీయ అరంగేట్రానికి కేరళను వాడుకోవాలని కె.చంద్రశేఖర రావు భావిసక్తున్నారని అంటున్నారు. మొత్తానికి ప్రభుత్వ ఖర్చుతో సొంతంగా తన బలాన్ని పెంచుకోవాలనుకుంటున్న కె.చంద్రశేఖర రావు వ్యూహానికి ఏ పార్టీ అయినా ఫిదా కావాల్సిందే అంటున్నారు.
Tags:    

Similar News