పదవి ఇస్తే ఓకే అనేసే నేతల్ని చూశాం. కోరి పదవి ఇస్తే.. కాదు పొమ్మనే సిత్రమైన పరిస్థితి ఏపీ టీడీపీలో నెలకొంది. పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని కాదని చెప్పటం.. అది కూడా నేరుగా కాకుండా.. సోషల్ మీడియాలో పోస్టు రూపంలో పెట్టి ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసిన కేశినేని నాని తీరు పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ అంత మొండిగా నాని ఎందుకు వ్యవహరించినట్లు?
ఓటమి బాధలో ఉన్న బాబుకు మరింత ఇబ్బంది కలిగించేలా నాని ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? అన్నది ప్రశ్నగా మారింది. నాని పోస్టు వెనుక ఒకట్రెండు అంశాలు కావని.. ఎప్పటి నుంచో ఉన్న అసంతృప్తి అగ్నిపర్వతం పేలి.. పోస్టు పేరుతో లావా చిమ్మినట్లుగా చెబుతున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత విజయవాడలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు తన ఆఫీసు వాడుకోవాలని నాని కోరారు.
అందుకు బాబు కూడా ఓకే చెప్పి.. కేశినేని భవన్ ను వాడుకోవాలనుకునే తరుణంలో గొల్లపూడిలోని టీడీపీ ఆఫీసును వాడుకోవటంపై నాని ఆగ్రహంగా ఉన్నారు.
గుంటూరుకు.. గొల్లపూడికి తేడా ఏముందని సింఫుల్ గా చాలామంది తీసిపారేయొచ్చు కానీ.. దాని వెనుక లెక్కలు చాలానే ఉన్నట్లుగా చెబుతున్నారు. తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవటం.. దేవినేని మాటలకు వాల్యూ ఇస్తున్నారన్న భావన నానిలో ఉంది. ఈ కారణంగానే ఆయన హర్ట్ అయి.. సోషల్ మీడియాలో అలాంటి వ్యాఖ్య చేసినట్లుగా చెబుతున్నారు.
విజయవాడ ఎంపీ నియోజకవర్గ బాధ్యతల్ని వల్లభనేని వంశీమోహన్ చూసే తరుణంలో కేశినేని శ్రీనివాస్ ను దేవినేని ఉమామహేశ్వరరావు ముందు తీసుకొచ్చారు. పలు విషయాల్లో ఇరువురి మధ్య కోల్డ్ వార్ నడిచింది. తాజా ఓటమి తర్వాత తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవటంపై గుర్రుగా ఉన్న నాని.. తాజాగా తన అసంతృప్తిని అలా బయటపెట్టారని చెప్పక తప్పదు.