ఆ గొయ్యే 60 మందిని పొట్ట‌న‌బెట్టుకుందా?

Update: 2018-09-13 14:30 GMT
కొండ‌గ‌ట్టు ఘోర ప్ర‌మాదంలో 60 మంది అమాయ‌కులు అశువులు బాసిన సంగ‌తి తెలిసిందే. బ్రేకులు ఫెయిల్ కావ‌డంతోనే ఆ ప్ర‌మాదం జ‌రిగింద‌ని బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న బాలిక అర్చ‌న వెల్ల‌డించ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన తీరుపై అధికారులు ఓ అంచ‌నాకు వ‌చ్చారు. అయితే, పూర్తి స్థాయి విచార‌ణ జ‌రిపిన అన‌తరం మాత్ర‌మే ఈ ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను వెల్ల‌డిస్తామ‌ని వారు తెలిపారు. డ్రైవ‌ర్ అతి వేగం వ‌ల్లే బ‌స్సు అదుపు త‌ప్పి గోతిలో ప‌డింద‌ని అంతా భావించారు. అయితే, గ‌త ఏడాది ఉత్తమ డ్రైవ‌ర్ గా అవార్డు అందుకున్న ఆ డ్రైవ‌ర్...నిర్ల‌క్ష్యంగా బ‌స్సు న‌డిపి ఉండ‌డ‌ని ఆర్టీసీ అధికారులు అభిప్రాయ‌ప‌డ్డారు. వారి అభిప్రాయం ప్ర‌కార‌మే....బ్రేకులు ఫెయిల్ అయి ప్ర‌మాదం జ‌రిగింద‌ని ప్ర‌త్య‌క్ష సాక్షి అయిన బాలిక అర్చ‌న చెప్పింది. అయితే, ఈ ప్ర‌మాద తీవ్ర‌త ఇంత‌పెర‌గ‌డానికి...భారీ సంఖ్య‌లో అమాయ‌కులు బ‌ల‌వ‌డానికి మ‌రోకార‌ణం కూడా ఉంద‌ని స్థానికులు అనుకుంటున్నారు.

ఆ ప్ర‌మాదం జ‌రిగిన ఘాట్ రోడ్డు పక్కన రియల్టర్లు తవ్విన 32 అడుగుల భారీ గొయ్యి వల్లే కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుకు పక్కనే ఉన్న వాగును పూడ్చి భవనాలు కట్టేందుకు  రియ‌ల్ట‌ర్లు ....ఘాట్ రోడ్డు వాలులో ఉన్న మట్టిని తవ్వి... వాగులో పోశారని వారు ఆరోపిస్తున్నారు. అందువ‌ల్లే, అక్క‌డ 32 అడుగుల భారీ గొయ్యి ఏర్ప‌డింద‌ని అంటున్నారు. అ మ‌ట్టి లేక‌పోవ‌డం వ‌ల్లే బ‌స్సు ఒక్క‌సారిక‌గా నిలువుగా ఆ గోతిలో పడి ప్రమాద తీవ్రత పెరిగింద‌ని చెబుతున్నారు. గతంలోనూ ఓ ఆర్టీసీ బస్సు  లోయ సమీపానికి వెళ్లి పెను ప్రమాదం నుంచి తప్పించుకుంద‌ని, ఆ ప్రాంతంలో అనేక ఆటోలు - ద్విచక్ర వాహనా ప్రమాదాల‌కు గుర‌య్యాయ‌ని అంటున్నారు. ఇన్న ప్ర‌మాదాలు జ‌రుగుతున్నా....రియల్ ఎస్టేట్ వ్యాపారులు - అధికారులకు ప‌ట్ట‌లేద‌ని - వారెవ్వ‌రూ...ఆ భారీ గోతిపై దృష్టి సారించలేద‌ని ఆరోపిస్తున్నారు. ఆ అక్రమ నిర్మాణాలకు - రియ‌ల్ట‌ర్లకు పలు పార్టీల నాయకుల మ‌ద్ద‌తు కూడా ఉంద‌ని అంటున్నారు. గ‌తంలో చిన్న‌ ప్ర‌మాదాలు జ‌రిగిన‌పుడు స్పందిస్తే...నేడు ఈ పెను ప్ర‌మాదం త‌ప్పేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేద‌ని, ఆ 32 అడుగుల భారీ గొయ్యిని పూడ్చి - అక్రమ నిర్మాణాలు తొలగించాలని - సహజ సిద్ధ వాగును పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. మ‌రి, స్థానికులు చెబుతున్న విష‌యాల‌పై ప్ర‌భుత్వం విచార‌ణ చేప‌డుతుందో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News