ప్రముఖ సినీనటుడు - కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజుకు గవర్నర్ గిరీ దక్కడంపై చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఈ వార్త గత వారం రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రసారం అవుతున్నప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడటం లేదు. ఈ క్రమంలో ఆయనకు పదవి దక్కకుండా అడ్డుపడుతున్న సమీకరణాలు ఏంటనే చర్చ మొదలైంది. పార్టీకి చెందిన కొందరు నేతలే రెబల్ స్టార్ కు రాజ్ భవన్ పీఠం దక్కకుండా వాదనలు వినిపిస్తున్నారని అంటున్నారు.
బీజేపీ సిద్ధాంతాలకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉండకుండా పార్టీలు మారిన కృష్ణంరాజుకు పదవి కట్టబెడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని బీజేపీకి చెందిన కొందరు నేతలు వాదిస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి పార్టీ ఏర్పాటు చేసినపుడు పీఆర్‌పీలో వెళ్లిన కృష్ణంరాజు తదనంతర పరిణామాల్లో బీజేపీకి వచ్చారని గుర్తుచేస్తున్నారు. అలా అవకాశవాదిగా ఉన్న కృష్ణంరాజుకు పదవి ఇవ్వడం ద్వారా పార్టీకి కంకణబద్దులు కాకపోయినప్పటికీ గౌరవిస్తున్నారనే భావన కలుగుతుందని చెప్పినట్లు సమాచారం. బదులుగా పార్టీలో ఉన్న సీనియర్ నేతలైన దగ్గుబాటి పురందీశ్వరీ - కన్నా లక్ష్మీనారాయణలకు పదవి ఇవ్వడం మంచిందని అంటున్నారు. ఇదిలాఉండగా మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి - మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్ర సేనారెడ్డి గవర్నర్ పదవి కోసం ఢిల్లీలో జోరుగా లాబీయింగ్ చేసుకుంటున్నట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/