జైట్లీ నోట‌... మోదీ అస‌లు ప్లాన్ బ‌య‌ట‌కొచ్చింది!

Update: 2018-02-01 09:30 GMT
భార‌తీయ జ‌న‌తా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారు ఈ టెర్మ్‌కు సంబంధించిన తుది బ‌డ్జెట్‌ ను పార్ల‌మెంటులో ప్రవేశ‌పెట్టింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దిశానిర్దేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కాసేప‌టి క్రితం పార్ల‌మెంటు స‌మావేశాల్లో భాగంగా లోక్ స‌భ‌లో 2018-19 బ‌డ్జెట్‌ ను ప్ర‌వేశ‌పెట్టారు. గ్రామీణ భార‌తాన్ని - ప్ర‌త్యేకించి రైతాంగానికి స‌రికొత్త ఊపిరిలూదే బ‌డ్జెట్ లా వినిపిస్తున్న ఈ బ‌డ్జెట్‌ లో చాలా విష‌యాల‌నే మోదీ చెప్ప‌క‌నే చెప్పేసిన‌ట్లుగా తెలుస్తోంది. జైట్లీ బ‌డ్జెట్‌ ను కాస్తంత లోతుగా ప‌రిశీలిస్తే... ఈ విష‌యం సులువుగానే అర్థం కాక మాన‌ద‌న్న మాట వినిపిస్తోంది. ఆయా వ‌ర్గాల‌కు - రంగాల‌కు - రాష్ట్రాల‌కు జ‌రిగిన కేటాయింపుల‌ను ప‌రిశీలిస్తే... వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే ఈ బ‌డ్జెట్‌ ను రూపొందించిన‌ట్లుగా చాలా సుస్ప‌ష్టంగానే అర్థం కాక మాన‌దు. జైట్లీ త‌న బ‌డ్జెట్‌ లో ఏపీకి ఏ మేర‌కు కేటాయింపులు చేశార‌న్న విష‌యానికి వ‌స్తే... రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆర్థిక లోటుతోనే కాకుండా క‌నీసం రాజ‌ధాని కూడా లేని రాష్ట్రంగా ఏర్ప‌డిన ఏపీకి మోదీ స‌ర్కారు ఈ ద‌ఫా కూడా మొండి చెయ్యే చూపింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే.. రాష్ట్ర ఆర్థిక లోటును పూరించే బాధ్య‌త కేంద్రానిదేన‌ని విభ‌జ‌న చ‌ట్టం చెబుతున్నా కూడా మోదీ స‌ర్కారు ఆ దిశ‌గా ఈ బ‌డ్జెట్లో అస‌లేమీ కేటాయించ‌లేద‌నే చెప్పాలి.

అంతేకాకుండా విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న మేర‌కు ఏపీకి కేటాయించిన జాతీయ స్థాయి సంస్థ‌లు - ఇత‌ర విద్యా సంస్థ‌ల‌కు వంద‌లు - వేలాది కోట్ల రూపాయ‌ల నిధులు అవ‌స‌ర‌మున్నా... ఈ బ‌డ్జెట్‌ లో జైట్లీ కేవ‌లం ప‌ది - ఇర‌వై కోట్లు అంటూ చిల్ల‌ర విదిలించారు. దీనిని బ‌ట్టి చూస్తే... ఈ బ‌డ్జెట్‌లో అస‌లు కేంద్రం... ఏపీ వైపు చూసిన దాఖ‌లానే క‌నిపించ‌డం లేద‌న్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే... మ‌రో ఏడాదిలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూటమిలోని భాగ‌స్వామ్య పార్టీల‌తో క‌లిసి రంగంలోకి దిగిన బీజేపీ... ఏపీలో టీడీపీతో జ‌ట్టు క‌ట్టింది. ఫ‌లితంగా ఓ రెండు - మూడు ఎంపీ సీట్ల‌తో పాటుగా ఓ నాలుగు ఎమ్మెల్యే సీట్ల‌ను కూడా ఆ పార్టీ సంపాదించ‌గ‌లిగింది. మ‌రోవైపు ఈ కూట‌మికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తుగా నిలిచిన నేపథ్యంలో ఏపీలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఎన్నిక‌లు ముగిసి కేంద్రంలో బీజేపీ - రాష్ట్రంలో టీడీపీ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత ఒక పార్టీ ప్ర‌భుత్వంలో మ‌రో పార్టీ నేత‌లు చేరిపోయారు. మొత్తంగా ఇరు పార్టీలు ఇప్ప‌టికీ మిత్ర‌ఫక్షాలుగానే కొన‌సాగుతున్నాయి.

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ ఈ పార్టీల మ‌ధ్య పొర‌పొచ్చాలు ఎక్కువవుతున్నాయి. ఒక పార్టీపై మ‌రో పార్టీ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో ఇరు పార్టీల మ‌ధ్య పొత్తు ముగిసిన‌ట్టేన‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఈ వాద‌న నిజ‌మేన‌న్న‌ట్లుగా మోదీ స‌ర్కారు త‌న చివ‌రి బ‌డ్జెట్‌ లో ఏపీకి మొండి చెయ్యే చూపింది. ఏపీకి సంబందించి ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా చెప్పుకునేంత స్థాయిలో నిధులు కేటాయించ‌ని మోదీ స‌ర్కారు... వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో త‌న‌కు అవ‌స‌రం లేద‌ని చెప్పేసింద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మ‌రోవైపు టీడీపీకి చేయిచ్చేసి... వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీతో బీజేపీ జ‌ట్టు క‌డుతుంద‌ని, ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయ‌ని ఊహాగానాలు మ ఒద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌లు నిజ‌మేన‌న్న‌ట్లుగా వైసీపీ నేత‌ల నోట నుంచే కాకుండా ఏకంగా జ‌గ‌న్ నోట కూడా ఆస‌క్తికర కామెంట్లు వినిపించాయి.

ఏపీకి న్యాయం చేస్తే గీస్తే... బీజేపీకి మ‌ద్ద‌తిచ్చేందుకు త‌మ‌కు ఏమీ అభ్యంత‌రం లేద‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డం, ఆ ప్ర‌క‌ట‌న‌ను టీడీపీ నేత‌లు హైలెట్ చెయ్యడం తెలిసిందే. ఈ ఊహాగానాల‌ను ఖండించే విష‌యంపై బీజేపీ నేత‌లు అస‌లు నోరే విప్ప‌లేదు. అయితే స్పందించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితిలో ఉన్న వైసీపీ మాత్రం... ఎన్నిక‌ల త‌ర్వాత మాత్ర‌మే బీజేపీతో పొత్తు విష‌యాన్ని ప‌రిశీలిస్తామ‌ని, అది కూడా ఏపీకి న్యాయం జ‌రిగింద‌ని తాము భావిస్తేనే.. ఆ ధిశ‌గా అడుగులు వేస్తామ‌ని చెప్పుకొచ్చింది. ఈ నేప‌థ్యంలో ఏపీకి న్యాయం చేయ‌గ‌లిగితే... వైసీపీ మ‌ద్ద‌తు బీజేపీకి ఖాయ‌మ‌ని తేలిపోయింది. అయితే... ఈ బడ్జెట్లో ఏపీకి లేశ‌మాత్రం కూడా న్యాయం చేయ‌లేని మోదీ... జ‌గ‌న్ మ‌ద్ద‌తు త‌న‌కు అవ‌స‌రం లేద‌ని చెప్పేసిన‌ట్లుగానే భావించాల‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తానికి ఏపీతో త‌మ‌కు ఇక ఏమాత్రం ప‌నిలేద‌ని, ఆ రాష్ట్రంలోని టీడీపీ - వైసీపీల‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం అంత‌క‌న్నా లేద‌ని మోదీ తేల్చి పారేసిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

Tags:    

Similar News