సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ యాక్సిడెంట్ ఉదంతం ఇప్పుడంతా పెద్ద చర్చ జరుగుతోంది. ప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. యాక్సిడెంట్ కు కారణం హద్దులు దాటిన వేగంగా పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. యాక్సిడెంట్ జరగటానికి కారణంపై భరత్ బాబాయ్ మూర్తి రాజు కొత్త అంశాన్ని చెబుతున్నారు.
ప్రమాదం జరగటానికి ముందు రెండు గంటలు స్విమ్మింగ్ చేశారని.. అలసిపోయి వాహనం నడపటం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ఆయన చెబుతున్నారు. రోడ్డు మీద ఆగి ఉన్న లారీని భరత్ నడుపుతున్న స్కోడా కారు వేగంగా ఢీ కొట్టటంతో ఘటనా స్థలంలోనే ఆయన మరణించటం తెలిసిందే.
ఇక.. అంత్యక్రియలకు రవితేజ కానీ.. కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవటంపై భరత్ బాబాయ్ మూర్తి రాజు స్పందించారు. తమ్ముడితో ఉన్న అనుబంధం కారణంగానే రవితేజ అంత్యక్రియలకు రాలేదన్నారు. కుటుంబ సభ్యులు ఎవరూ కూడా తీవ్రంగా గాయపడిన భరత్ ముఖాన్ని చూడలేకే అంత్యక్రియలకు రాలేకపోయారని చెబుతున్నారు. గతంలో చెడు అలవాట్లకు లోనైనా.. ఇప్పుడు వాటికి దూరంగా ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రమాదంపై మరో వాదన వినిపిస్తోంది. యాక్సిడెంట్ జరిగిన కారులో మద్యం సీసాలు ఉండటంతో.. భరత్ మద్యం సేవించి ఉండొచ్చని.. అతి వేగంతో ఉండటం.. చీకట్లో ఎదురుగా ఉన్న లారీని గుర్తించకపోవటం కూడా ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. ఇక.. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో కూడా భరత్ ఒంట్లో ఆహారం తీసుకున్న దాఖలాలు లేవని.. పళ్ల రసాలు తీసుకున్నట్లుగా మాత్రమే ఉందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. మద్యం మత్తు..గంటల తరబడి స్విమ్మింగ్ చేసిన అలసట.. అతి వేగం వెరసి.. ప్రాణం పోయేలా ప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/