అదేం చిత్రమో కానీ.. కాంగ్రెస్ పార్టీకి కేరాఫ్ అడ్రస్ అయిన గాంధీ ఫ్యామిలీలోని సభ్యులు విదేశాలకు వెళితే.. మాట మాత్రం కూడా చెప్పరు. ఆ మధ్య రాహుల్ ఏకంగా నెలల తరబడి విదేశాల్లో ఉన్నా.. ఆయన ఎక్కడకు వెళ్లింది.. ఏం చేసింది చెప్పింది లేదు. వ్యక్తిగత విషయాలన్నీ మీడియాకు చెప్పాల్సిన అవసరం లేకున్నా.. దేశానికి కీలక నేతలకు సంబంధించిన కనీస సమాచారం దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా. వ్యక్తిగత పర్యటన అని ఒక్కమాటతో తేల్చినప్పటికీ.. అన్నేసి రోజులు విదేశాల్లో రాహుల్ ఉండి ఏం చేశారో వివరణ ఇచ్చింది లేదు.
తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అమెరికాకు వెళ్లారు. ఆమె అమెరికాకు వెళ్లిన తర్వాత మాత్రమే.. ఆమెకు సంబంధించిన విదేశీ పర్యటన సమాచారం బయటకు పొక్కింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సోనియమ్మ అమెరికాకు వెళ్లారని.. వైద్య పరీక్షల కోసమని చెబుతున్నారు. కొన్నాళ్లుగా సోనియాగాంధీ తీవ్రమైన అనారోగ్యానికి గురైనట్లుగా వార్తలు వస్తున్నాయి. యథావిధిగా అలాంటి వార్తలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ వివరణ ఇవ్వలేదు.