జ‌గ‌న్ అస‌లు విష‌యం మ‌ర్చిపోయారా?

Update: 2016-07-21 04:30 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కుటుంబంలో లుక‌లుక‌లున్నాయా? ఆ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీలో జ‌గ‌న్ మాతృమూర్తి వై.ఎస్.విజయమ్మ - ఆయ‌న సోద‌రి షర్మిల‌ ఎందుకు చురుగ్గా పాల్గొన‌డం లేదు? వారు తెర‌మీద‌కు వ‌చ్చే సంద‌ర్భం ఇప్ప‌ట్లో లేదా? ఈ సందేహాలు - చ‌ర్చోప‌చ‌ర్చ‌లు ఇపుడు ఏపీ పాలిటిక్స్‌ లో హాట్ టాపిక్‌.

కేంద్ర - రాష్ట్రాలలోని కాంగ్రెస్ సర్కార్‌ కు సవాల్ విసురుతూ వై.ఎస్.జగన్మోహన్‌ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత జగన్ జైలుకెళ్లడంతో పార్టీ పరిరక్షణ బాధ్యతలను ఆయన తల్లి వై.ఎస్.విజయమ్మ - సోదరి షర్మిల‌ భుజాన ఎత్తుకొన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలు మినహా అన్ని స్థానాలలో గెలిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సవాల్ విసిరింది. ఆ సమయంలో జగన్మోహన్‌ రెడ్డి జైలులో ఉండటం, ఆ ఎన్నికల ప్రచారం బాధ్యత అంతా తల్లి విజయమ్మ - సోదరి షర్మిల‌ భుజాన ఎత్తుకోవడం - పార్టీ ఆ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. ఇలా జగన్ ఆదేశాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిరక్షణ కోసం నాడు ప్రచార కీలక బాధ్యతలు చేపట్టిన విజయమ్మ - షర్మిల‌ పాత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్దగా కనిపించడంలేదు. వారి ప్రస్తావన కూడా అప్రస్తుతంగానైనా తెరపైకి రావడంలేదు. జగన్ స్వయంగా పార్టీ పర్యవేక్షణ చేస్తుండటంతో వారి అవసరం పార్టీకి ఇంకా రాలేదని - సమయం వచ్చినప్పుడు మాత్రం మళ్లీ తెరపైకి వస్తారని జగన్‌ కు సన్నిహితులు పేర్కొంటున్నారు.

జగన్ జైలులో ఉన్న సమయంలో కి అండగా ఉన్న  ఇప్పుడు పార్టీలో ఎందుకు కనిపించడంలేదు...? జగన్ తిరిగొచ్చాక వారి పాత్ర నామమాత్రంగా ఎందుకు మారింది...? వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వారు మళ్లీ తెరపైకి వస్తారా అన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కొనసాగుతున్న చర్చ. ఇప్పుడు జగనే స్వయంగా పార్టీ వ్యవహారాలను చూసుకోవడం వల్ల తల్లి - చెల్లి అవసరం ప్రస్తుత పార్టీకి అంతగా అవసరంలేదని జగన్ సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి. ఒకప్పుడు పార్టీ పరిరక్షణ కోసం జనంలోకి వెళ్లే బాధ్యతను విజయమ్మ గానీ షర్మిల గానీ భుజాన వేసుకొన్నా జగన్ ఆదేశాల మేరకేనని రేపు సార్వత్రిక ఎన్నికలు వస్తే మళ్లీ ఆయన ఆదేశానుసారమే తెరపైకి రావచ్చొని కూడా జగన్ సన్నిహితులు పేర్కొం టున్నారు. విజయమ్మ - షర్మిళ పార్టీలో క్రీయాశీలక పాత్ర పోషిస్తే పార్టీకి మరింత ఉజ్వల దశ వస్తుందని మరికొందరు వైసీపీ నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల స‌మ‌యంలోనే వారిని తెర‌మీద‌కు తీసుకురావ‌డం స‌రైన‌ద‌ని భావిస్తున్నందుకే ఇపుడు క్రియాశీలంగా ఉంచ‌డం లేదంటున్నారు. అంతే త‌ప్ప లుక‌లుక‌లేమీ లేవ‌ని పేర్కొంటున్నారు.
Tags:    

Similar News