తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా గడువున్నా దాన్ని కాదని ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్లనున్నామని ప్రకటించి పార్టీలో అంతర్గత కుమ్ములాటకు ఆయనే తెర తీసారు. సెప్టెంబర్ నెలలోనే అభ్యర్ధులను ప్రకటిస్తామని చెప్పిన కె.చంద్రశేఖర రావు దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ అసమ్మతికి ఆజ్యం పోశారు. అంటే దాదాపు మూడు నెలలకు ముందే అభ్యర్ధుల ప్రకటన ఉంటుంది. ఇది టిక్కట్ ఆశిస్తున్న వారికి రాకపోతే భంగపాటే. తెలంగాణలోని సిట్టింగులందరికీ దాదాపు టిక్కట్లు ఇస్తామని ఇంతకు ముందు ప్రకటించిన కె.చంద్రశేఖర రావు వారిలో కొందరిని మార్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
అదే జరిగితే టిక్కట్ రాని సిట్టింగులు పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తారు. ఇక అన్ని నియోజకవర్గాల్లోనూ టిక్కట్లు ఆశిస్తున్న వారు ఉండనే ఉన్నారు. వారందరికి ఉద్యమంలో పని చేసిన అనుభవం - ప్రజలలో గుర్తింపు ఉన్నాయి. ఒక్కసారైనా శాసనసభలో కూర్చోవాలన్న కోరిక కూడా అధికంగానే ఉంది. అలాంటి వారికి టిక్కట్ నిరాకరిస్తే వారంతా పార్టీకి వ్యతిరేకంగా పని చేసే అవకాశం ఉంది. ఎన్నికలకు కాసింత ముందు అభ్యర్ధులను ప్రకటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని, అలా కాకుండా ముందే ప్రకటించడం వల్ల తెలంగాణలో చాలా చోట్లా అసమ్మతి సెగలు రాక తప్పదని అంటున్నారు. టిక్కట్లు ఇచ్చిన వారందరిని గెలిపించుకునే సత్తా తనకు ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెబుతున్నా స్ధానిక పరిస్ధితులు మాత్రం అందుకు భిన్నంగానే ఉన్నాయంటున్నారు. ప్రభుత్వం వివిధ పథకాలు ప్రకటించి అమలు చేస్తున్నా... వాటి వెనుక ఉన్న ప్రజాప్రతినిధుల అవినీతే వారికి ఓటర్లను దూరం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో చాలా మంది ప్రజాప్రతినిధులపై ప్రజల్లో తీవ్ర అసంత్రప్తి నెలకొంది. దీనికి కారణం ప్రభుత్వ పథకాలు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన వారికే దక్కుతున్నాయనే అపవాదు కూడా ఉంది. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి అననుకూలంగా పని చేసే అవకాశం ఉంది.
రోజరోజుకు కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకుంటోంది. ఈ పార్టీ ఇతర పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో నిలవనుంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు లోపాయికారిగా కలిసి పోటీ చేయాలనుకునంటున్నాయి. ఇక కోదండరాం వంటి మేథావులు కూడా కాంగ్రెస్ తో కలిస్తే తెలంగాణ రాష్ట్ర సమితికి విజయం అంత సులభం కాదు. ఈ విషయం గ్రహించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు రానున్న కాలంలో తన దూకుడు పెంచుతున్నారు. పార్టీలో అసమ్మతికి చెక్ పెట్టి తిరిగి అధికారాన్ని పొందడం కె.చంద్రశేఖర రావుకు అంత సులభం కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.