తెలంగాణలో ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మరో పదిరోజుల్లోనే ఎన్నికలు జరుగనున్నాయి. మహాకూటమి ఇప్పుడిప్పుడే ప్రచారాన్ని విస్తృతం చేస్తోంది. సీట్ల సర్దుబాటు - అసమ్మతులు - ఉపసంహరణల పేరుతో కాలయాపన చేసిన కాంగ్రెస్ తాజాగా ప్రచారాన్ని ఉధృతం చేయడానికి ప్లాన్ చేస్తోంది. మరోవైపు కేసీఆర్ ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నాడు.
టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నియోజకవర్గ స్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ - మిత్రపక్షాలు మాత్రం ఇంకా కలివిడిగా కాకుండా వేరువేరుగానే క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు కూటమి ప్రచారం సాగుతోంది. సోనియా - రాహుల్ సభలతో ఎన్నికల ప్రచారం ఊపు వచ్చినా.. కూడా మిత్రపక్షాలు మాత్రం ఆ వేగాన్ని అందుకోలేకపోతుండడం కూటమి నేతల్లో ఆందోళన కలిగిస్తోంది.
మహాకూటమిలో టికెట్లు దక్కని రెబల్స్ ను అధిష్టానం దూతలు రంగంలోకి దిగి ఉపసంహరింపచేశారు. కానీ వారు మనస్ఫూర్తిగా ప్రచార రంగంలోకి దిగడం లేదు. ఇక 5 సీట్లు ఆశించిన సీపీఐ - 12సీట్లు కోరిన టీజేఎస్ లు తమకు అన్ని సీట్లు దక్కకపోవడంతో కాంగ్రెస్ తో కలిసి రావడం లేదు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డిపై హుస్నాబాద్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి వేసిన నామినేషన్ తిరస్కరణ గురికావడంతో చాడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆయన సీపీఐతో కలిసి ప్రచారంలో పాల్గొనకపోవడం సీపీఐకి శరాఘాతగా మారింది. సీపీఐ నేత చాడా.. ఇదే విషయాన్ని పీసీపీ చీఫ్ ఉత్తమ్ కు ఫిర్యాదుచేసినా ప్రవీణ్ రెడ్డి స్పందించడం లేదని సమాచారం.
వీరే కాదు.. సీపీఐ - టీడీపీ - టీజేఎస్ స్థానాల్లో పోటీచేస్తున్న కాంగ్రెస్ రెబల్స్.. బరిలోనుంచి కొన్ని చోట్ల తప్పుకున్నా కూడా మిత్రపక్షాలకు సహకరించకుండా ఉండడం మహాకూటమి గెలుపుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిణామం కూటమి సీట్లకు చేటు తెచ్చేలా ఉందనే ప్రచారం జరుగుతోంది.