కేసీఆర్ మాట‌ను ధిక్క‌రిస్తున్న గులాబీ నేత‌లు

Update: 2018-09-11 05:12 GMT
ప‌వ‌ర్ చేతిలో ఉన్న‌ప్పుడు ఎవ‌రికి వారు కామ్ గా ఉంటారు. అప్ప‌టికి ఒక‌రిద్ద‌రు మాట్లాడే ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు పాల‌కుడు చూసీచూడ‌న‌ట్లుగా ఉంటే అలాంటి వారి వాయిస్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. అయితే.. కేసీఆర్ లాంటి అధినేత చేతిలో ప‌వ‌ర్ ఉంటే.. పార్టీలో పిన్ డ్రాప్ సైలెన్స్ అన్న‌ట్లు ఉంటుంది.  ఆ విష‌యం ఇప్ప‌టికే ఫ్రూవ్ అయ్యింది కూడా.

అయితే.. పార్టీని.. నేత‌ల్ని గులాబీ బాస్ ఇదే ర‌కంగా ఎంత కాలం క‌మాండ్ చేయ‌గ‌ల‌రు?  కంట్రోల్ చేస్తార‌న్న సందేహాల‌కు స‌మాధానాలు దొరికేస్తున్నాయి.

నిన్న‌టి వ‌ర‌కూ గులాబీ అధినేత మాటే శాస‌నంగా.. ఆయ‌న క‌నుసైగే చ‌ట్టంగా పీలై.. ఆయ‌న్ను ఫాలో అయిన ప‌రిస్థితి గులాబీ పార్టీలో ఉంది. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఒక్క‌రంటే ఒక్క‌రు నోరు తెరిచిన ప‌రిస్థితి లేదు. ఆయ‌న పాల‌న‌లో త‌ప్పులు దొర్లినా వాటిని వేలెత్తి చూపించే సాహ‌సం చేయ‌లేదు.

అలాంటి వారంతా ఇప్పుడు త‌మ కింద‌కు నీళ్లు రావ‌టంతో ఒక్కొక్క‌రుగా నోరు విప్పుతున్నారు. రోడ్ల మీద‌కు వ‌స్తున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు 105 మంది అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించ‌టం ద్వారా సంచ‌ల‌నం సృష్టించిన కేసీఆర్ నిర్ణ‌యంతో గులాబీ పార్టీలో కొత్త క‌ల‌క‌లం మొద‌లైంది.  లిస్ట్ లో పేర్లు రాని అభ్య‌ర్థులు ఇప్పుడు ఆగ్ర‌హంతో చిందులు తొక్కుతున్నారు. త‌మ‌కే టికెట్లు ఇవ్వాల‌ని.. అధినేత త‌న నిర్ణ‌యాల్ని కాస్త మార్చుకోవాల‌న్న ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌లు ఎక్కువ అవుతున్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించిన త‌ర్వాత ఎంతోకొంత అసంతృప్తి ఉన్నా.. ఈ స్థాయిలో నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌లు వెల్లువెత్తుతాయ‌ని.. వేరే పార్టీలోకి మారిపోవాల‌న్న ప్ర‌యత్నాల‌తో పాటు.. ఇండిపెండెంట్ అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దిగాల‌న్న ఆలోచ‌న‌లు చేస్తార‌ని అనుకోలేద‌ని చెబుతున్నారు.

అసంతృప్తులు రెండు మూడు రోజులు గ‌ళం విప్పి.. త‌ర్వాత కామ్ అయిపోతార‌ని త‌ల‌చినా.. అందుకు భిన్నంగా రోజులు గ‌డిచే కొద్దీ.. అసంతృప్త స్వ‌రాలుఅంత‌కంత‌కూ బ‌ల‌ప‌డుతున్న ప‌రిస్థితి. దీంతో.. కేసీఆర్ కు ఇప్పుడు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ మాట‌ను గులాబీ శ్రేణులు ధిక్క‌రించ‌ట‌మా? అసంతృప్తితో స్వ‌రం పెంచ‌ట‌మా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్త స్వ‌రాల్ని స‌ర్దిచెప్ప‌కుంటే.. రానున్న రోజులు మ‌రింత ఇబ్బందిక‌రంగా మార‌తాయ‌న్న భావ‌న‌కు టీఆర్ ఎస్ అధినాయ‌క‌త్వం వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. అందుకే.. కేటీఆర్.. హ‌రీశ్ ల‌తో పాటు.. ప‌లువురు ముఖ్య‌నేత‌లు ఇప్పుడు బుజ్జ‌గింపుల ప‌ర్వాన్ని షురూ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. టికెట్లు ఆశించిన భంగ‌ప‌డిన కొంద‌రు ఆశావాహులైతే త‌మ అధినేత డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందంటూ శాప‌నార్థాలు సైతం పెడుతుండ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News