టీఆర్ఎస్ నేతలు ఏ ఇద్దరు కలిసినా చర్చించుకోవటం కనిపిస్తుంది. అయితే.. అందుకు పక్కా ప్లాన్ అవసరం. అంతేకానీ ఎవరికి వారు నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తే.. లాభం కంటే నష్టమే ఎక్కువ. ఆ విషయాన్ని మర్చిపోయినట్లుగా ఉంది టీఆర్ఎస్ నేతలు తీరు చూస్తే.. తాజాగా అయోధ్య రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి.
తాజాగా కరీంనగర్ లో ప్రజా సంఘాల జేఏసీ అధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి నోటి నుంచి ఊహించని రీతిలో వ్యాఖ్యలు వచ్చాయి. మొన్నటికి మొన్న టీఆర్ఎస్ నేత ఒకరు మాట్లాడుతూ.. అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి చందాలు ఎందుకు ఇవ్వాలని.. భద్రచలం రాములోరికి ఇవ్వాలంటూ చేసిన వ్యాఖ్యల అగ్గి ఇంకా చల్లారలేదు. అలాంటివేళలో.. తాజాగా పిడమర్తి రవి మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆ మాటకు వస్తే.. శ్రీరాముడి జన్మస్థలిగా చెప్పే అయోధ్య కూడా తప్పనట్లుగా ఆయన మాటలు ఉండటం గమనార్హం. అంతేకాదు.. రానున్న రోజుల్లో జైభీమ్ - జై శ్రీరాం అన నినాదాల మధ్య దేశంలో యుద్ధం జరగనుందన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు అయోధ్యలో రాముడు ఎక్కడ పుట్టాడో తెలీదని.. ఈ మధ్యనే నేపాల్ ప్రధాని తమ దగ్గరే రాముడు పుట్టాడన్నారు.
రామ మందిరానికి చందాలు ఇవ్వాలని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని.. ఈ మధ్యనే చందాల దందా షురూ అయ్యిందన్నారు.అసలు రాముడు భారతదేశంలో పుట్టాడా? నేపాల్ లో పుట్టాడా? జర్మనీలో పుట్టాడా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన బండి సంజయ్.. నిత్యం గుళ్లు.. గోపారలంటూ టీఆర్ఎస్ పార్టీని విమర్శించటమే పనిగా మార్చుకున్నారన్నారు. దళితులు కూడా హిందువులే అయితే.. గుళ్లల్లోకి ఎందుకు రానివ్వటం లేదని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే.. పిడమర్తి రవి ప్రసంగించే సమయంలో వేదిక మీద ఉన్న బీజేపీ నాయకుడు అజయ్ వర్మ అడ్డు తగిలారు. పిడమర్తి ప్రసంగానికి అడ్డు తగిలారు. ఇదేమీ రాజకీయ వేదిక కాదని.. తమ పార్టీ అధ్యక్షుడిపై విమర్శలు తగవని స్పష్టం చేశారు. చూస్తుంటే.. రానున్నరోజుల్లో రాముడి చుట్టూ కొత్త రాజకీయ అలజడి తెలంగాణలో మొదలు కానుందన్న విషయం ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలుస్పష్టం చేస్తున్నాయని చెప్పక తప్పదు. ఇక.. పిడమర్తి రవి వ్యవహారానికి వస్తే.. అనవసరమైన కంపను మీద వేసుకున్న చందంగా రాముడి చుట్టూ కొత్త వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నారని చెప్పక తప్పదు.