కర్ణాటక - మహారాష్ట్ర వివాదం.. చాలా దూరం వెళ్లిందే.. కేంద్రం జోక్యం తప్పదా..!
కొంతకాలంగా కర్ణాటక, మహారాష్ట్ర మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. కర్ణాటక రాష్ట్రంలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలపాలంటే మొదట మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఉద్దవ్ డిమాండ్‌ను.. కర్ణాటక సీఎం యడియూరప్ప నిర్ధ్వంద్వంగా తోసిపుచ్చారు. దీంతో ఈ వివాదం కొంతకాలం సద్దుమణిగింది. తాజాగా ఉద్దవ్ థాక్రే మరోసారి ఈ వివాదాన్ని రాజేశారు.
కర్ణాటక సరిహద్దుల్లో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు.
దీంతో కర్ణాటక తీవ్రంగా స్పందించింది. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలను కాదు ముంబైని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్ బెలగావీ అన్నారు. దీంతో వివాదం మళ్లీ రాజుకున్నది.
అయితే ఇటీవల కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదాలపై బుధవారం మహారాష్ట్ర సీఎం ఠాక్రే ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే ఠాక్రే వ్యాఖ్యలకు కర్ణాటక దీటుగా స్పందించింది.
డిప్యూటీ సీఎం లక్ష్మణ్ బెలగావీలో మాట్లాడుతూ.. ‘గతంలో ముంబయి ప్రాంతంలోని భాగంగానే బెలగావీ ఉండేది.. మా రాష్ట్రంలోని కొంతమంది ప్రజలు ముంబయి-కర్ణాటక ప్రాంతానికి చెందినవారే. అందువల్ల ముంబయిపై మాకూ హక్కు ఉంది. ఆ ప్రాంతాన్ని కర్ణాటకలో కలపాలి.. అప్పటి వరకు ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతున్నాం’ అంటూ డిమాండ్ చేశారు లక్ష్మణ్.