జియో ట్యాక్సీలు...రావ‌డం లేదట‌

Update: 2017-02-26 05:18 GMT
యాప్ ఆధారిత ట్యాక్సీ సేవల వ్యాపారంలోకి ప్రవేశించే ఆలోచన లేదని ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో స్పష్టం చేసింది. అంతేకాదు సంబంధం లేని రంగాల్లోకి అడుగుపెట్టే ఉద్దేశం లేదని సంస్థ పేర్కొంది. టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు తెరలేపిన రిలయన్స్ జియో కూడా ఓలా, ఉబెర్ మాదిరిగా యాప్ బేస్డ్ ట్యాక్సీ సర్వీసులు ప్రారంభించవచ్చని చాలా రోజులుగా మార్కెట్లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

జియో 600 కార్లకు ఆర్డరిచ్చిందని, త్వరలోనే సర్వీసులు ప్రారంభం కానున్నాయంటూ ఈమధ్య ఓ ఆన్‌ లైన్ పబ్లికేషన్ కథనం పేర్కొంది. అయితే అది తప్పుడు సమాచారమంటూ రిలయన్స్ అధికార ప్రతినిధి ట్విట్టర్ ద్వారా ఆ వార్తను ఖండించారు. సంస్థకు ఏమాత్రం సంబంధం లేని రంగాల్లోకి ప్రవేశించే ఆలోచన లేదని మరో ఉన్నతాధికారి అన్నారు. ఈ వారం తొలినాళ్లలో అంతర్జాతీయ ఆన్‌ లైన్ ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌ తో జియో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. అందులోభాగంగా ఉబెర్ ట్యాక్సీలో ప్రయాణించేవారు జియో మనీ వ్యాలెట్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు వీలుంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News