మోడీని వాడేసుకున్నందుకు ఇలా చేసేశారు

Update: 2017-03-11 04:33 GMT
ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ స్థాయిని - హోదాను ఉప‌యోగించుకోవ‌డం కాదు. ఏకంగా ప్ర‌చారానికి వాడేసుకున్నా ఏం కాదు. సింపుల్ గా ఓ క్ష‌మాప‌ణ చెప్పేస్తే స‌రిపోతుంది. ప్ర‌ధాన‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తిని ప‌ట్టుకొని ఇవేం మాటలు అనుకోకండి. ప్రముఖ టెలికాం నెట్‌ వర్క్‌ రిలయన్స్‌ జియో - ఈ-కామర్స్‌ సంస్థ పేటీఎం ఇవే చేశాయి మ‌రి. అనుమతి లేకుండా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఫొటోలను తమ ప్రకటనలపై ఉపయోగించడంపై ఈ రెండు సంస్థలు క్షమాపణలు చెప్పాయి. ప్రధాని ఫొటోలు ప్రకటనలపై వినియోగించడంపై ఈ రెండు కంపెనీలకు గతంలో ప్రభుత్వం నోటీసులు పంపించింది. నిబంధనల ఉల్లంఘనపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా జరిమానా కట్టాల్సి ఉంటుందని జియో - పేటీఎంలను హెచ్చరిస్తూ నోటీసులు పంపించింది. దీంతో ఈ రెండు సంస్థలు ప్రభుత్వాన్ని క్షమాపణలు కోరాయి.

గత ఏడాది సెప్టెంబరులో మార్కెట్లోకి వచ్చిన జియో నెట్‌ వర్క్‌ ప్రకటనలపై మోడీ ఫొటో వేశారు. ఈ 4జీ సేవల నెట్‌ వర్క్‌ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ డిజిటల్‌ ఇండియా ప్రాజెక్ట్‌ కు అంకితం చేస్తున్నామని జియో మోడీ ఫొటోతో పాటు ప్రకటన ప్రచురించింది. గత నవంబరులో పెద్ద నోట్ల రద్దు తర్వాత పేటీఎం కూడా ఇదే తరహాలో ప్రకటనల్లో మోడీ ఫొటోను ఉపయోగించింది. అయితే దీనిపై ప్రతిపక్షాల నుంచేగాక సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దీంతో ఆ రెండు సంస్థలకు కేంద్రం గత నెల నోటీసులు పంపింది. వీటికి స్పందించిన ఆ సంస్థలు బేషరతు క్షమాపణ తెలిపాయి. నిబంధనల ప్రకారం వాణిజ్య ప్రకటనలకు ప్రధాని పేరు, ఫొటో ఉపయోగించకూడదు. ప్రభుత్వాన్ని క్షమాపణలు కోరాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News