హెచ్1బీ గుడ్ న్యూస్...షరతులు వర్తిస్తాయి
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇమిగ్రేషన్ విధానాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే H-1B వీసాల జారీ నిబంధనలను కఠినతరం చేసిన అమెరికా కొద్దికాలం క్రితం ఇంకో షాక్ ఇస్తూ..... దరఖాస్తు రుసుమును కూడా పెంచింది. అయితే, ఈ షాకుల పరంపరలో ఓ గుడ్ న్యూస్ తెరమీదకు వచ్చింది. అదే హెచ్1 బీ వీసాదారుల పిల్లల కాలేజీ చదువుల ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వమే ముందుకు రావడం. అయితే, ఇది అందరి కోసం కాదండి. కేవలం న్యూజెర్సీ వాసులకే.
`ఎస్2555` పేరుతో న్యూజెర్సీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం - హెచ్1 బీ వీసా కలిగి ఉన్న వారి పిల్లలు లేదా డిపెండెంట్ హోదాలో పిల్లలకు ‘అవుట్ ఆఫ్ స్టేట్ ట్యూషన్’ ఫీజు వసూలు చేయరు. న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ ఈ చట్టంపై సంతకం చేశారు. జెర్సీ వాసులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్న అయితే, ఇందులో పలు షరతులు కూడా ఉన్నాయి.
కొత్త చట్టం ప్రకారం లబ్ధి పొందాలనుకునే వారు న్యూజెర్సీ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి లేదా న్యూజెర్సీ హైస్కూల్‌లో కనీసం మూడేళ్లు చదివి ఉండాలి. అలా అయితేనే ఈ వెసులుబాటు దక్కుతుంది. కాగా, అమెరికాలో హెచ్1 బీ వీసా కలిగి ఉన్న భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండగా న్యూజెర్సీలోనూ భారతీయులు తమ పిల్లల పై చదువుల భారం ఈ కొత్త చట్టంతో కొంత తగ్గనుంది.