మేఘాలయ ఎన్నికల ప్రచారం సందర్భంగా మంగళవారం షిల్లాంగ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి రాహుల‌్....రూ.70 వేల ఖరీదైన జాకెట్ ధరించి రావడంతో బీజేపీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. రాహుల్ పై బీజేపీ మేఘాలయ విభాగం ....తీవ్రస్థాయిలో కామెంట్లు చేసింది. మేఘాలయ ప్రజల గురించి పట్టించుకోకుండా - రాష్ట్రంలో ఉన్న అసమర్థ సర్కారుకు వంతపాడతారా అంటూ ట్వీట్ చేసింది. రాహుల్ పక్షపాతం మేఘాలయ ప్రజలను వెక్కిరించేలా ఉందని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లను కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి నవ్వుతూ కొట్టిపారేశారు. దేశంలో కాంగ్రెస్ బలపడడంతో బీజేపీలో అసహనం ఎక్కువైందని, ఆ పార్టీ నిస్పృహకు ఇటువంటి ఆరోపణలు నిదర్శనమని చెప్పారు. ఆన్ లైన్ లో వెతికి..ఆ రేట్లు ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
అదే జాకెట్ బయట రూ.700లకే దొరుకుతుందని - కావాలంటే ప్రధాని మోదీకి పంపిస్తామని ఎద్దేవా చేశారు. మోదీ.....56 ఇంచుల ఛాతి అంటారని....ఆయ కొలతలు కరెక్టుగా తెలిస్తే ఆయనకు కూడా ఒక జాకెట్ పంపుతామని చెప్పారు. ఈ జాకెట్ వివాదంపై పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ స్పందించారు. కీలకమైన పదవిలో ఉన్నా సాధారణ జీవితం గడిపేందుకే రాహుల్ ఇష్టపడతారని రాహుల్ ను సమర్థించారు. రాహుల్ గాంధీ రూ.70,000 విలువైన జాకెట్ ధరించారని బీజేపీ ఆరోపిస్తోందని,.... రాహుల్ జాకెట్ కొంటున్నప్పుడు వారు బిల్లును చెక్ చేశారా అంటూ ఎదురు ప్రశ్నించారు.