పార్ల‌మెంటులో శూర్ప‌ణ‌క‌..ఇరుకున‌ప‌డిన‌ బీజేపీ

Update: 2018-02-09 08:20 GMT
మోడీ మాట‌ల రాయుడు. దొర‌క‌కుండా మాట్లాడ‌టం ఆయ‌నకు వెన్న‌తో పెట్టిన విద్య. కానీ దానికి మీనింగ్ చెప్పి మోడీని ఇరికించాడు మోడీ నేతృత్వంలోని మంత్రి గారు. ఇంత‌కూ ఏం జ‌రిగిందంటే... మోడీ ప్ర‌సంగించే స‌మ‌యంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌద‌రి గ‌ట్టిగా న‌వ్వారు. భోళాగా ఉండే రేణుకాకు బిగ్గ‌ర‌గా న‌వ్వ‌డం అల‌వాటు. అయితే... ఈ న‌వ్వుపై ప్ర‌ధాని మోడీ ఒక సెటైర్ వేశారు. దీంతో పార్ల‌మెంటులో ప‌లువురు ఎంపీలు న‌వ్వారు. ఈ ప‌రిణామాల‌కు హ‌ర్ట‌యినా కూడా రేణుకా చౌద‌రి ఊరికే ఉన్నారు. అక్క‌డితో ఆగితే బానే ఉండేది. కానీ, కేంద్ర మంత్రి రిజిజు ఒక పొర‌పాటు చేశారు.

రేణుకా చౌద‌రిపై మోడీ చేసిన వ్యాఖ్య‌లు *రామాయ‌ణం సీరియ‌ల్ త‌ర్వాత అలాంటి న‌వ్వు చూసే భాగ్యం ద‌క్కింది* కోట్ చేసి రామాయ‌ణం సీరియ‌ల్ లో శూర్ప‌ణ‌క న‌వ్వుతున్న ఫొటోను పోస్టు చేశారు. దీంతో రేణుకాచౌద‌రి మండిపడ్డారు. పార్ల‌మెంటులో కాబ‌ట్టి ఊరికే ఉన్నాను. ఇంత బ‌రి తెగిస్తే ఊరుకుంటానా అంటూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఒక మ‌హిళ‌గా ఇది న‌న్ను తీవ్రంగా అవ‌మానించ‌డ‌మే అంటూ రాజ్య‌స‌భ‌లో హక్కుల తీర్మానం ప్ర‌వేశ పెట్టారామె. నిజానికి ఆ ట్వీట్‌పై చాలా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. గౌవ‌ర‌ప్ర‌ద‌మైన పోస్టుల్లో ఉన్న వారు ఇలాంటి వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌ను త‌గ్గించే అసాధార‌ణ ప‌నులు చేయ‌రాద‌ని చాలా మంది రిజిజుపై దాడిచేశారు. దీంతో మంత్రి రిజిజు త‌న ట్వీట్‌ను, వీడియోను తొల‌గించారు. కానీ అప్ప‌టికే ఆగ్ర‌హం చెందిన రేణుకాచౌద‌రి స‌భా హ‌క్కుల తీర్మానం ప్ర‌వేశ పెట్టారు.

సాధార‌ణంగా కాంగ్రెస్‌ను ఆడుకునే మోడీ మొద‌టి సారి త‌న మంత్రి చేసిన పొర‌పాటు వ‌ల్ల కాంగ్రెస్ కు దొరికిపోయాడు. అయితే, ఇటీవ‌ల మోడీకి ఇలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. ఏదో ర‌కంగా మోడీ దొరికిపోతున్నాడు. జీఎస్టీ సంద‌ర్భం త‌ర్వాత మోడీ కున్న క్రేజ్ త‌గ్గ‌డం - మ‌ధ్య‌త‌ర‌గ‌తిపై మోడీ చిన్న‌చూపు వంటి ప‌రిణామాల‌తో మోడీ ప్ర‌భ స‌డ‌లింది. ఎపుడైతే నాయ‌కుడు బ‌ల‌హీన ప‌డ‌తాడో అపుడు ప్ర‌తిప‌క్షాలు ప్ర‌తి అవ‌కాశాన్ని వినియోగించుకుంటాయి. ఎందుకంటే కాన్ఫిడెన్సే అన్నిటికంటే బ‌ల‌మైన‌ది.
Tags:    

Similar News