ఇప్పటిదాకా అక్కడ టీఆర్ ఎస్ అభ్యర్థిదే విజయం అనుకున్నారంతా.. పోటీచేయడానికి కాంగ్రెస్ - టీడీపీ నుంచి సరైన అభ్యర్థి లేకపోవడంతో టీఆర్ ఎస్ అభ్యర్థి గెలుపుపై ధీమాగా ఉన్నారు. కానీ ఇప్పుడు మహాకూటమి పొత్తుల ఎత్తుల్లో ఆ స్థానానికి భారీ పోటీ ఏర్పడింది. ఏకంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన వారు ఇక్కడ పోటీచేస్తూ టీఆర్ ఎస్ కు జలక్ ఇస్తున్నారు..
ఖమ్మం అసెంబ్లీ సీటు ఇప్పుడు హాట్ సీటుగా మారింది. ఇక్కడ టీఆర్ ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ బరిలో ఉన్నారు. మహాకూటమి పొత్తుల్లో ఈ సీటును కావాలని కాంగ్రెస్ - టీడీపీ రెండు పట్టుబడుతున్నాయట.. ఈసారి ఖమ్మం ఎంపీగా కంటే ఎమ్మెల్యేగానే పోటీ చేసేందుకు టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు డిసైడ్ అయ్యారట.. గతసారి తనకు ఖమ్మం అసెంబ్లీ నుంచి అతి ఎక్కువ ఓట్లు వచ్చాయని.. అందుకే ఇక్కడ పోటీచేస్తే గెలుస్తామని యోచిస్తున్నారు. బలమైన టీఆర్ ఎస్ హోరులో ఎంపీగా కంటే ఎమ్మెల్యేగానైతేనే ఈజీగా గెలువొచ్చని ఆయన భావిస్తున్నారు.
ఇక రాజ్యసభ మాజీ ఎంపీ - కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేణుకాచౌదరి కూడా ఈసారి కాంగ్రెస్ లోని నాయకత్వ శూన్యతను ఆసరాగా చేసుకొని ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ కాంగ్రెస్ ను ఏలాలని యోచిస్తోందట.. అందుకే గత సారి తను ఏరికోరి ఇప్పించిన ఖమ్మం సీటులో గెల్చిన తన శిష్యుడు పువ్వాడ అజయ్ కారెక్కడంతో ఇప్పుడు తనే ఖమ్మం నుంచి పోటీచేసి శిష్యుడికి షాక్ ఇవ్వాలని రేణుకా చౌదరి డిసైడ్ అయ్యిందట.. పొత్తుల్లో భాగంగా ఖమ్మం ఎంపీ సీటును టీడీపీకి ఇస్తే తనకు సీటు ఉండదని భావించి ఆమె ఖమ్మం అసెంబ్లీకి మారుతున్నట్టు సమాచారం.
ఇలా రేణుకా చౌదరి - నామా నాగేశ్వరరావులు ఖమ్మం సీటు తమకంటే తమకే కావాలని ఒత్తిడి తెస్తుండడంతో ఈ సీటు ఎవరికి వరిస్తుందనే ఆసక్తి తెలంగాణ రాజకీయాల్లో పెరిగిపోతోంది. కాంగ్రెస్ - టీడీపీలు ఈ సీటు కోసం పట్టుబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.