సుప్రీం సంచలనం: ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు

Update: 2020-02-09 10:47 GMT
సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలంటే రిజర్వేషన్ల మయంగా మారి అర్హులైన టాలెంటెడ్స్ ఎంపిక కావడం లేదనే బాధ ఉంది. 90మార్కులు వచ్చినా ఓసీలకు ఉద్యోగాలు రాని పరిస్థితుల్లో 40 మార్కులు వచ్చినా ఎస్టీలకు ఉద్యోగాలు వస్తున్న పరిస్థితి. దేశం వెనుకబడి ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ఈ రిజర్వేషన్ల కారణంగా కొంతమంది అకారణంగా కులం సర్టిఫికెట్లు మార్చి ఉద్యోగాలు పొందుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి.

 తాజాగా ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.  పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలనుకోవడం ప్రాథమిక హక్కుల్లో భాగం కాదని సుప్రీం కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.

ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మండమస్ జారీ చేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ఉత్తరఖండ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించకపోవడంపై కొందరు సుప్రీం కోర్టుకు ఎక్కగా.. ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు పొందడం ప్రాథమిక హక్కు కాదని.. వీటిని అమలు చేయాలని రాజ్యాంగంలో రాష్ట్రాలకు విధివిధానాలు స్పష్టం చేయలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.


Tags:    

Similar News