దేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ఫేస్ బుక్ కు మంచి సాన్నిహిత్యం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ తో మోడీ పలు సార్లు భేటి అయ్యి ఇద్దరూ పరస్పరం క్లోజ్ గా ఫొటోలు దిగారు. కొన్ని సంవత్సరాలుగా ఈ అమెరికాకు చెందిన ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్ తన మీడియాలో బిజెపీకి వ్యతిరేకంగా ఏం చేయడం లేదనే టాక్ ఉంది. ఫేస్ బుక్ లో బీజేపీ నేతల మత విద్వేషాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఫేస్‌బుక్ దీనిని ఖండించినప్పటికీ ఆ వివాదాలు పోలేదు. ఫేస్‌బుక్‌కు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయని కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
తాజా వివాదం ఏంటంటే.. ఫేస్ బుక్ ఈ కరోనా సమయంలోనూ బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదని బయటపడింది. కోవిడ్ -19 సెకండ్ వేవ్ గందరగోళంతో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ పాలనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో రిజైన్ మోడీ (#ResignModi) అనే హ్యాష్‌ట్యాగ్ గత రెండు రోజులుగా ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్ గా మారింది..
కానీ బుధవారం ఫేస్ బుక్ ఈ హ్యాష్‌ట్యాగ్‌కు సంబంధించిన పోస్ట్‌లను బ్లాక్ చేసిందని, కొన్ని గంటల తర్వాత అవి పునరుద్ధరించబడ్డాయని సమాచారం. పోస్టులు బ్లాక్ కావడంతో నెటిజన్లు మరియు ఇతరులు దీనిని గమనించారు. బీజేపీ పట్ల ముఖ్యంగా ప్రధాని మోడీ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నందుకు ఫేస్‌బుక్ పై విరుచుకుపడ్డారు.
ఈ వార్త దావానంలా వ్యాపించింది. దీంతో ఫేస్‌బుక్ తప్పు దిద్దుకుంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌ను పొరపాటున అడ్డుకున్నామని.. ప్రభుత్వ ఆదేశాల మేరకు కాదని చెప్పుకొచ్చింది. “ఫేస్‌బుక్ వివిధ కారణాల వల్ల హ్యాష్‌ట్యాగ్‌లను బ్లాక్ చేస్తుంది. కొన్ని మానవీయంగా కానీ చాలా ఆటోమేటెడ్ అంతర్గత మార్గదర్శకాలపై ఆధారపడి ఇలా చేస్తారు. హ్యాష్‌ట్యాగ్‌తో కాకుండా లేబుల్‌తో అనుబంధించబడిన కంటెంట్ నుండి లోపం ఏర్పడడం వల్ల ఇవి డిలీట్ అయ్యాయి ” అని ఫేస్‌బుక్ ప్రతినిధి తెలిపారు. "మేము ఈ హ్యాష్‌ట్యాగ్‌ను పొరపాటున తాత్కాలికంగా బ్లాక్ చేసాము. దానిని పునరుద్ధరించాం" అని ప్రతినిధి చెప్పారు.
ఖచ్చితంగా ఫేస్ బుక్ ఇలాంటి సంఘటనలతో బీజేపీపై ప్రేమను చూపించి నెటిజన్ల విశ్వసనీయతను కోల్పోతోంది. ట్రెండింగ్ టాపిక్స్ మరియు వాటిని నిర్వహించడంలో ఫేస్ బుక్ మరింత చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఫేస్ బుక్ పై విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఏర్పడనుంది.